Liquor Limit At Home : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొందరు విపరీతంగా మద్యం సేవిస్తుంటారు. ఇక కొందరు అప్పుడప్పుడు మద్యం తాగుతారు. అయితే మద్యాన్ని కొందరు ఇళ్లలో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు. దీంతో అవసరం అయినప్పుడు తాగవచ్చని వారు భావిస్తారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయడం చట్టరీత్యా నేరం. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఇంట్లో గరిష్టంగా ఎంత మేర మద్యాన్ని నిల్వ చేయవచ్చు అనే విషయంపై ఆయా రాష్ట్రాల్లో భిన్న రకాల నియమాలు అమలులో ఉన్నాయి.
రాష్ట్రాలను బట్టి ఒక్క వ్యక్తి తన ఇంట్లో నిల్వ చేసుకునే మద్యం స్టోరేజ్ మారుతుంది. ఇక ఏయే రాష్ట్రాల్లోని పౌరులు ఎంత మేర మద్యాన్ని ఇళ్లలో నిల్వ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఒక వ్యక్తి గరిష్టంగా తన ఇంట్లో 18 లీటర్ల వరకు మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. 9 లీటర్ల మేర రమ్, విస్కీ, వోడ్కా లేదా జిన్‌ను నిల్వ చేసుకోవచ్చు. ఇక హర్యానాలో ఒక వ్యక్తి గరిష్టంగా తన ఇంట్లో 6 బాటిల్స్ మేర మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. బీర్ అయితే 12 బాటిల్స్, రమ్ అయితే 6 బాటిల్స్, వోడ్కా లేదా జిన్ అయితే 6 బాటిల్స్, వైన్ అయితే 12 బాటిల్స్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు.
ఏపీలో 3 బాటిల్స్ వరకు అనుమతి..
పంజాబ్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా 1.50 లీటర్ల మేర మద్యాన్ని, 6 లీటర్ల మేర బీర్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో ఈ లిమిట్ కూడా ఇంతే ఉంది. అలాగే ఏపీలో మద్యం అయితే 3 బాటిల్స్, బీర్ అయితే 6 బాటిల్స్‌ను ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా 18 లీటర్ల మేర మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో 6 బాటిల్స్ మద్యం, 18 బాటిల్స్ బీర్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు. అస్సాంలో 12 బాటిల్స్ మద్యాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. గోవాలో 12 బాటిల్స్ మద్యం, 24 బాటిల్స్ బీర్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా 48 బీర్ బాటిల్స్ ను, 36 విస్కీ బాటిల్స్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు. కేరళలో 3 లీటర్ల వరకు మద్యం, 6 లీటర్ల వరకు బీర్‌కు అనుమతి ఉంది. మధ్యప్రదేశ్‌లో అత్యధిక ఆదాయం ఉన్నవారు 100 మేర ఖరీదైన మద్యం బాటిల్స్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు. రాజస్థాన్‌లో ఇంట్లో పెట్టుకునేందుకు 12 బాటిల్స్ వరకు మద్యానికి ఒక వ్యక్తికి అనుమతి ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో అయితే 12 బాటిల్స్ వరకు మద్యం లేదా బీర్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక మిజోరం, గుజరాత్, బీహార్, నాగాలండ్, లక్షద్వీప్ రాష్ట్రాలను డ్రై స్టేట్స్‌గా వ్యవహరిస్తున్నారు. అంటే.. ఇక్కడ మద్యం విక్రయాలపై నిషేధం విధించారన్నమాట. అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఉండే వారికి మద్యం లభించదు.