NABARD Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. నాబార్డ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.89వేలు..

NABARD Recruitment 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న నాబార్డ్‌ శాఖ‌ల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాబార్డ్ (National Bank For Agriculture And Rural Development) రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మొత్తం 102 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 102 పోస్టుల్లో జ‌న‌ర‌ల్ పోస్టులు 50 ఉండ‌గా, చార్ట‌ర్డ్ అకౌంట్ పోస్టులు 4, ఫైనాన్స్‌లో 7, కంప్యూట‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో 16, అగ్రి క‌ల్చ‌ర్‌లో 2, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీలో 2, ఫిష‌రీస్‌లో 1, ఫుడ్ ప్రాసెసింగ్‌లో 1 పోస్టు ఉన్నాయి.

అలాగే ఫారెస్ట్రీలో 2 పోస్టులు, ప్లాంటేష‌న్ అండ్ హార్టిక‌ల్చ‌ర్‌లో 1, జియో ఇన్ఫర్మేటిక్స్‌లో 1, డెవ‌ల‌ప్ మేనేజ్ మెంట్‌లో 3, స్టాటిస్టిక్స్‌లో 2, సివిల్ ఇంజినీరింగ్‌లో 3, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో 1, ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ సైన్స్ లో 2, హ్యూమ‌న్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌లో 2, రాజ్‌భాష‌లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు గాను సంబంధిత పోస్టును బ‌ట్టి 60 శాతం మార్కుల‌తో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే జూలై 1 నాటి వ‌య‌స్సు 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

NABARD Recruitment 2024 full details how to apply eligibility and salary information
NABARD Recruitment 2024

రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక‌..

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.850గా నిర్ణ‌యించారు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.150 చెల్లిస్తే చాలు. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, ధ్రువ ప‌త్రాల ప‌రిశీల‌న‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఇక ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీని ఆగ‌స్టు 15, 2024గా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు నాబార్డ్ వెబ్‌సైట్ www.nabard.org ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు గాను నిబంధ‌న‌ల మేర‌కు వయో పరిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. ఓబీసీల‌కు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు 5 ఏళ్లు, దివ్యాంగుల‌కు విభాగాల వారిగా 10 నుంచి 15 ఏళ్ల వ‌ర‌కు, అలాగే ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు కూడా వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను పోస్టును బ‌ట్టి వేత‌నం రూ.44,500 నుంచి రూ.89,150 మ‌ధ్య ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ఎగ్జామ్‌ల‌ను నిర్వ‌హిస్తారు.

200 మార్కుల‌కు ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌..

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష విధానంలో మొత్తం 200 మార్కుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. మొత్తం ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ప్ర‌శ్న‌లు ఉంటాయి. రీజ‌నింగ్‌లో 20 ప్ర‌శ్న‌లకు 20 మార్కులు, ఇంగ్లిష్‌లో 30 ప్ర‌శ్న‌ల‌కు 30 మార్కులు, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌లో 20 ప్ర‌శ్న‌ల‌కు 20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 20 ప్ర‌శ్న‌ల‌కు 20 మార్కులు ఉంటాయి. అలాగే డెసిష‌న్ మేకింగ్‌లో 10 ప్ర‌శ్న‌ల‌కు 10 మార్కులు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌లో 20 ప్ర‌శ్న‌ల‌కు 20 మార్కులు ఉంటాయి. ఎకాన‌మీ అండ్ సోష‌ల్ ఇష్యూస్‌పై 40 ప్ర‌శ్న‌ల‌కు 40 మార్కులు, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ లో 40 ప్ర‌శ్న‌ల‌కు 40 మార్కులు ఉంటాయి. ఎగ్జామ్‌ల‌ను ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో నిర్వ‌హిస్తారు.

ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు జూలై 27, 2024వ తేదీన ప్రారంభం అయ్యాయి. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ ఆగ‌స్టు 15, 2024 కాగా ఫేజ్‌-1 (ప్రిలిమిన‌రీ) ఆన్‌లైన్ ప‌రీక్ష‌ను సెప్టెంబ‌ర్ 1, 2024వ తేదీన నిర్వ‌హిస్తారు.