Jio Rs 1029 Prepaid Plan Full Details : జియో ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ఉచితం..

Jio Rs 1029 Prepaid Plan Full Details : ఈ రోజుల్లో చాలా మంది మొబైల్‌లో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ఏ ప్లాన్‌ను వాడినా స‌రే ఓటీటీ యాప్స్ ప్ర‌యోజ‌నాలు పొందేలా ఉండే ప్లాన్ల‌ను ఎంచుకుంటున్నారు. తాము రీచార్జి చేసుకునే ప్లాన్ల‌తో ఓటీటీ యాప్స్ ఏవైనా ఫ్రీగా వ‌స్తే బాగుండును అని అనుకుంటున్నారు. అందుక‌నే టెలికాం కంపెనీలు కూడా ఓటీటీ యాప్‌ల‌ను ఉచితంగా ఇచ్చే ప్లాన్‌ల‌ను లాంచ్ చేస్తున్నాయి. అయితే జియోలో కూడా స‌రిగ్గా ఇలాంటిదే ఓ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో క‌స్ట‌మ‌ర్ల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిష‌న్ ఓటీటీ యాప్ ఉచితంగా ల‌భిస్తుంది. ఇక ఈ ప్లాన్ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జియో ప్రీపెయిడ్ వినియోగ‌దారులు రూ.1029 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ యాప్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. క‌నుక అన్ని రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక రోజుల‌ను బ‌ట్టి చూస్తే రోజుకు రూ.13 మాత్ర‌మే ఈ ప్లాన్‌కు ఖ‌ర్చ‌వుతుంది. కానీ ప్రైమ్ వీడియో ద్వారా ఎంతో ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. అలాగే ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు డేటా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Jio Rs 1029 Prepaid Plan Full Details know which benefits you will get for this
Jio Rs 1029 Prepaid Plan Full Details

84 రోజుల వాలిడిటీ, 168 జీబీ డేటా..

ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు కూడా ఉచిత యాక్సెస్ ల‌భిస్తుంది. ఇలా ఈ ప్లాన్‌తో బ‌హుళ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ యాప్ ఉచితంగా ల‌భించాలంటే జియో ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవ‌చ్చు.