Railway Paramedical Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 1376 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Railway Paramedical Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పారామెడిక‌ల్ కు చెందిన ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 17, 2024 నుంచి ప్రారంభించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 16, 2024ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అర్హులైన అభ్య‌ర్థులు RRB అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1376 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

అప్లికేష‌న్ ఫీజు, ఇత‌ర వివ‌రాలు..

ఆర్ఆర్‌బీ పారామెడిక‌ల్ కేట‌గిరీస్ రిక్రూట్‌మెంట్ 2024 పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజిక‌ల్లీ హ్యాండికాప్డ్ అభ్య‌ర్థులు అయితే రూ.250 చెల్లిస్తే చాలు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ప‌లు విభాగాల‌కు గాను భిన్న ర‌కాలుగా అభ్య‌ర్థులు వ‌యో ప‌రిమితిని క‌లిగి ఉండాల్సి ఉంటుంది.

Railway Paramedical Recruitment 2024 candidates can apply know the full details
Railway Paramedical Recruitment 2024

డైటిషియ‌న్ పోస్టులు మొత్తం 5 ఉండ‌గా వ‌యో ప‌రిమితి 18-36 ఉండాలి, న‌ర్సింగ్ సూప‌రిండెంటెండ్ పోస్టులు 713 ఉన్నాయి. వీటికి 20-43 ఏళ్ల‌ను వ‌యో ప‌రిమితిగా నిర్ణ‌యించారు. ఆడియాల‌జిస్ట్ అండ్ స్పీచ్ థెర‌పిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. వ‌యో ప‌రిమితి 21 నుంచి 33 ఏళ్లుగా ఉంది. క్లినిక‌ల్ సైకాలిస్ట్ పోస్టులు 7 ఖాళీగా ఉండ‌గా, వీటికి వ‌యో ప‌రిమితిని 18-36 ఏళ్లుగా నిర్ణ‌యించారు. అలాగే డెంట‌ల్ హైజీనిస్ట్ పోస్టులు 3 ఉన్నాయి. వ‌యో ప‌రిమితి 18-36 ఏళ్లుగా ఉంది. డ‌యాల‌సిస్ టెక్నిషియ‌న్ పోస్టులు 20 ఉన్నాయి. వ‌యో ప‌రిమితి 20 నుంచి 36 ఏళ్లుగా ఉంది.

వ‌యో పరిమితి ఇలా..

హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్‌స్పెక్ట‌ర్ గ్రేడ్ 3 పోస్టులు 126 ఉన్నాయి. వ‌యో ప‌రిమితి 18 నుంచి 36 ఏళ్లుగా ఉంది. ల్యాబొరేట‌రీ సూప‌రింటెండెంట్ పోస్టులు 27 ఉన్నాయి. వ‌యో ప‌రిమితి 18 నుంచి 36 ఏళ్లుగా నిర్ణ‌యించారు. ప‌ర్‌ఫ్యూష‌నిస్ట్ పోస్టులు 2 ఉండ‌గా, వ‌యో ప‌రిమితి 21-43 ఏళ్లుగా ఉంది. ఫిజియోథెర‌పిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 20 ఉండ‌గా వ‌యో ప‌రిమితి 18-36 ఏళ్లుగా ఉంది. ఆకుపేష‌న‌ల్ థెర‌పిస్ట్ పోస్టులు 2 ఉండ‌గా వ‌యో ప‌రిమితి 18-36 ఏళ్లుగా ఉంది. క్యాథ్ ల్యాబొరేట‌రీ టెక్నిషియ‌న్ పోస్టులు 2 ఉండ‌గా వ‌యో ప‌రిమితి 18 నుంచి 36 ఏళ్లుగా నిర్ణ‌యించారు.

ఫార్మ‌సిస్ట్ (ఎంట్రీ గ్రేడ్‌) పోస్టులు 246 ఉండ‌గా వ‌య‌స్సు 20 నుంచి 38 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రేడియోగ్రాఫ‌ర్ ఎక్స్‌-రే టెక్నిషియ‌న్ పోస్టులు 64 ఉండ‌గా వ‌య‌స్సు 19 నుంచి 36 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. స్పీచ్ థెర‌పిస్ట్ పోస్టులు 1 ఉండ‌గా వ‌య‌స్సు 18 నుంచి 36 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కార్డియాక్ టెక్నిషియ‌న్ పోస్టులు 4 ఉండ‌గా వ‌యో ప‌రిమితి 18-36 మ‌ధ్య ఉండాలి. ఆప్తోమెట్రిస్ట్ పోస్టులు 4 ఉండ‌గా వ‌యో ప‌రిమితి 18-36 మ‌ధ్య ఉండాలి. ఈసీజీ టెక్నిషియ‌న్ పోస్టులు 13 ఉండ‌గా వ‌య‌స్సు 18-36 ఏళ్ళ మ‌ధ్య ఉండాలి. ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు 94, ఫీల్డ్ వ‌ర్క‌ర్ పోస్టులు 19 ఉన్నాయి. ఈ రెండు పోస్టుల‌కు గాను 18-36 ఏళ్లు, 18-33 ఏళ్ళ మ‌ధ్య వ‌యో ప‌రిమితిని క‌లిగి ఉండాలి.

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు www.indianrailways.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించ‌వ‌చ్చు. ఇక నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే తేదీ ఆగ‌స్టు 17 క‌నుక ఆ నోటిఫికేష‌న్ ద్వారా అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.