LIC Yuva Credit Life Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక స్కీమ్‌లను అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు కొత్త ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ప్రవేశపెడుతోంది. దేశంలోని ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీల్లో LIC ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంస్థ విశ్వసనీయతకు పేరెన్నిక గన్నది. ఇక ఇందులో LIC యువ క్రెడిట్ లైఫ్ ఒక పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీని తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇక దీని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
LIC యువ క్రెడిట్ లైఫ్ పాలసీని 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస మెచూరిటీ వ్యవధి 23 ఏళ్లు, గరిష్టంగా 75 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న తరువాత పాలసీ కాలవ్యవధి సమయంలో పాలసీ హోల్డర్ చనిపోతే అతని నామినీకి రూ.50 లక్షలు వస్తాయి. దీంతో ఆ మొత్తాన్ని లోన్లు చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు. పాలసీ హోల్డర్ పేరిట హోమ్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్ వంటివి ఉంటే ఈ పాలసీ కవరేజీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ లోన్లను చెల్లింవచ్చు. ఇలా ఈ పాలసీ పనిచేస్తుంది.
4 రకాలుగా ప్రీమియంలు..
అయితే ఈ పాలసీలో 4 రకాలుగా ప్రీమియంను చెల్లించవచ్చు. 5 నుంచి 30 ఏల్ల కాల వ్యవధికి పాలసీ తీసుకుంటే సింగిల్ ప్రీమియం చెల్లిస్తే చాలు. 10 నుంచి 30 ఏళ్ల పాలసీ టర్మ్ అయితే 5 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. అదే 15 నుంచి 30 ఏళ్ల పాలసీ టర్మ్ అయితే ప్రీమియంను 10 ఏళ్ల వరకు చెల్లించాలి. 25 నుంచి 30 ఏళ్ల వకు పాలసీ టర్మ్ ఉంటే 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. ఈ ప్రీమియంను ఏడాదికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి కట్టవచ్చు.
అయితే ఈ పాలసీ టర్మ్ పాలసీ కాదు. ఈ పాలసీని తీసుకున్న తరువాత ఒకవేళ పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ చనిపోతే అప్పుడు అతని పేరిట ఉన్న లోన్లను చెల్లించే భారం అతని కుటుంబంపై పడదు. ఈ పాలసీ కవరేజి కింద వచ్చే మొత్తంతో ఆ లోన్లను చెల్లించవచ్చు. అందువల్ల ఈ పాలసీ ఇలాంటి వాటికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పాలసీ గడువు ముగిసిన తరువాత పాలసీ హోల్డర్‌కు ఎలాంటి ప్రయోజనం లభించదు. కానీ పాలసీని ముందే సరెండర్ చేస్తే అతను చెల్లించిన మొత్తం ప్రీమియాన్ని తిరిగిచ్చేస్తారు. ఇలా ఈ పాలసీ పనిచేస్తుంది.
రూ.50 లక్షల కవరేజీ..
ఇక ఉదాహరణకు 20 ఏళ్ల ఒక వ్యక్తి ఈ పాలసీని 25 ఏళ్ల కాలానికి గాను తీసుకుంటే అతనికి కవరేజీ రూ.50 లక్షలు లభిస్తుంది. ప్రీమియం రూ.4850 చెల్లించాలి. ఇది 15 ఏళ్ల కాలానికి వర్తిస్తుంది. ఇలా ఈ పాలసీకి ప్రీమియంను చెల్లింవచ్చు. అయితే వ్యక్తి వయస్సు, పాలసీ టర్మ్‌ను బట్టి కూడా ప్రీమియం మారుతుంది. ఇక ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే licindia.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పాలసీని కొనవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఈ పాలసీని డిజి క్రెడిట్ లైఫ్ పేరిట అందుబాటులో ఉంచారు. ఆఫ్‌లైన్‌లో అయితే ఇదే పాలసీని యువ క్రెడిట్ లైఫ్ పేరిట పొందవచ్చు. ఇలా ఈ పాలసీతో ఎంతో ప్రయోజనం ఉంటుంది.