ITBP Constable Kitchen Services Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. టెన్త్ పాస్ అయిన వారికి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌.. జీతం రూ.69వేలు..

ITBP Constable Kitchen Services Recruitment 2024 : ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ITBP) వారు కిచెన్ స‌ర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న 819 కానిస్టేబుల్ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు వారు ITBP Constable Kitchen Services Notificaiton 2024 ను రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందుకు గాను సెప్టెంబ‌ర్ 2, 2024వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్నారు. అక్టోబ‌ర్ 1, 2024 తేదీని ఇందుకు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు కుక్‌, వాట‌ర్ క్యారియ‌ర్‌, కిచెన్ స‌ర్వీస్ వెయిట‌ర్‌గా ప‌నిచేయాల్సి ఉంటుంది. మొత్తం 819 పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు recruitment. itbpolice. nic.in అనే వెబ్ సైట్ లో ITBP Constable Kitchen Services Recruitment 2024 అనే నోటిఫికేష‌న్‌ను చూడ‌వ‌చ్చు. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను అభ్య‌ర్థులు రూ.100 అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళా అభ్య‌ర్థులు, దివ్యాంగులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన ప‌నిలేదు.

ITBP Constable Kitchen Services Recruitment 2024 know the full details and how to apply
ITBP Constable Kitchen Services Recruitment 2024

టెన్త్ పాస్ అయి ఉండాలి..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు రిజ‌ర్వేష‌న్ ఉన్న‌వారికి గ‌రిష్ట వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. ఈ పోస్టుల‌కు టెన్త్ పాస్ అయి ఉండాలి. అలాగే ఫుడ్ ప్రొడ‌క్ష‌న్ లేదా కిచెన్ అంశంలో లెవ‌ల్ 1 కోర్సును పూర్తి చేసి ఉండాలి. పురుషుల‌కు 389 పోస్టులు ఖాళీ ఉండ‌గా, మ‌హిళ‌ల‌కు 69 పోస్టుల‌ను కేటాయించారు. రిజ‌ర్వేష‌న్‌ను బ‌ట్టి ఈ పోస్టుల సంఖ్య‌ విభాగాల వారీగా మారుతుంది. ఈ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేస‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

అభ్య‌ర్థులు recruitment.itbpolice.nic.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. త‌రువాత లాగిన్ అయి అప్లికేష‌న్ ఫామ్ నింపాలి. సంబంధిత ధ్రువ ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం అప్లికేష‌న్ ఫామ్‌ను స‌బ్‌మిట్ చేయాలి. త‌రువాత ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి. ఇక ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెలవారి వేత‌నం రూ.21,700 నుంచి రూ.69,100 వ‌ర‌కు ఉంటుంది.