PGCIL JE Recruitment 2024 : గుర్గావ్లోని మహారత్న కంపెనీ అయిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ సంస్థలో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ ఇంజినీర్, సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, షార్ట్ లిస్ట్ తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను ఆగస్టు 29, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://www.powergrid.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మొత్తం ఈ రిక్రూట్మెంట్లో 38 ఖాళీలను భర్తీ చేస్తారు. జూనియర్ ఇంజినీర్ (గ్రేడ్ 3 లేదా ఎస్2) (సర్వే ఇంజినీరింగ్) పోస్టులు 15 ఉన్నాయి. సర్వేయర్ (గ్రేడ్ 4 లేదా డబ్ల్యూ 4) పోస్టులు 15 ఉన్నాయి. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (గ్రేడ్ 4 లేదా డబ్ల్యూ 4) పోస్టులు 8 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఐటీఐ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ లేదా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఇంజినీరింగ్ డిప్లొమా సివిల్ లేదా సర్వేయర్, బీఈ లేదా బీటెక్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయో పరిమితి, వేతనం వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితి ఇంజినీర్ పోస్టుకు అయితే గరిష్టంగా 31 ఏళ్లు, సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు అయితే గరిష్టంగా 32 ఏళ్లు మించకూడదు. జూనియర్ ఇంజినీర్ పోస్టుకు రూ.26వేల నుంచి రూ.1.18 లక్షలు, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.22వేల నుంచి రూ.85వేల వరకు నెలవారి వేతనం ఇస్తారు.
జూనియర్ ఇంజినీర్ (సర్వే ఇంజినీరింగ్) పోస్టుకు అప్లికేషన్ ఫీజు రూ.300గా ఉంది. సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, షార్ట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఆగస్టు 29, 2024. కనుక అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.