Jio Customer Service Recruitment 2024 : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కంపెనీలో ఖాళీగా ఉన్న కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా అడ్వయిజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు గాను ఆగస్టు 18, 2024వ తేదీన నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని రామంతాపూర్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
జియోలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో పనిచేయాలంటే అభ్యర్థులకు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కనీసం 6 నెలల పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. స్థానిక భాషలో చక్కగా మాట్లాడగలగాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కస్టమర్ల సమస్యను పరిష్కరించే స్కిల్ ఉండాలి. కస్టమర్ సమస్యను అర్థం చేసుకోగలిగే నైపుణ్యం ఉండాలి. అలాగే టెక్నికల్ అంశాలపై పట్టు ఉండాలి. సమస్యను సులభంగా పరిష్కరించగలిగే స్కిల్ ఉండాలి.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. అందుకు గాను https://careers.jio.com/index.aspx అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు. దీంతో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం ఇస్తారు. కనుక ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.