HAL Non-Executive Recruitment 2024 : టెన్త్‌, ఐటీఐ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. HALలో ఉద్యోగాలు..

HAL Non-Executive Recruitment 2024 : హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. HALలో టెన్యూర్ పద్ధ‌తిలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. ఈ పోస్టుల‌కు టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థులు రూ.200 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ, ఎక్స్-అప్రెంటిస్‌ల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు నుంచి మిన‌హాయింపును ఇచ్చారు.

అప్లికేష‌న్ ఫీజును అభ్య‌ర్థులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 14, 2024వ తేదీన ప్రారంభం కాగా ఇందుకు చివ‌రి తేదీ ఆగ‌స్టు 28, 2024. అభ్య‌ర్థుల‌కు జూలై 31, 2024 నాటికి వ‌య‌స్సు గ‌రిష్టంగా 28 ఏళ్ల లోపు ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్ ఉన్న అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

166 పోస్టుల‌కు ఖాళీలు..

HALలో మొత్తం 166 పోస్టుల‌కు ఖాళీలు ఏర్ప‌డ‌గా విభాగాల వారిగా ఖాళీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. డిప్లొమా టెక్నిషియ‌న్ (మెకానిక‌ల్‌) ఖాళీలు 26 ఉన్నాయి. వీటికి డిప్లొమా చేసిన వారు అర్హులు. డిప్లొమా టెక్నిషియ‌న్ (ఎల‌క్ట్రిక‌ల్‌) ఖాళీలు 15 ఉండ‌గా, వీటికి కూడా అభ్య‌ర్థులు డిప్లొమా చేసి ఉండాలి. అలాగే డిప్లొమా టెక్నిషియ‌న్ (సివిల్‌) ఖాళీలు 1 ఉండ‌గా, దీనికి కూడా డిప్లొమా చేసిన వారు కావాలి. అదేవిధంగా డిప్లొమా టెక్నిషియ‌న్ (మెట‌ల‌ర్జీ) ఖాళీలు 1 ఉండ‌గా, దీనికి కూడా డిప్లొమా చ‌దివిన వారు అర్హులు.

ఎల‌క్ట్రిక‌ల్ టెక్నిషియ‌న్ పోస్టులు 15 ఉన్నాయి. వీటికి టెన్త్‌, ఐటీఐ చేసి ఉండాలి. ఫిట్ట‌ర్ పోస్టులు 101 ఉన్నాయి, వీటికి కూడా టెన్త్‌, ఐటీఐ చేసి ఉండాలి. షీట్ మెట‌ల్ టెక్నిషియ‌న్ పోస్టులు 2, ఫౌండ్రీమ్యాన్ టెక్నిషియ‌న్ పోస్టులు 2, వెల్డ‌ర్ 1 పోస్టు, మెషినిస్ట్ 1 పోస్టు, ఎల‌క్ట్రోప్లేట‌ర్ టెక్నిషియ‌న్ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. వీట‌న్నింటినీ టెన్త్‌తోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.

అభ్య‌ర్థులు HAL వెబ్‌సైట్ https://haltejas.formflix.com/apply-online ను సంద‌ర్శించి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ లింక్ లో అప్లై చేయ‌వ‌చ్చు.