Supreme Court Of India Junior Court Attendant Recruitment 2024 : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అటెండెంట్‌గా పనిచేసేందుకు గాను ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 17, 2024వ తేదీన సుప్రీం కోర్టు ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు గాను మరిన్ని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోస్టులకు టెన్త్ చదివిన వారు, కుకింగ్ సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఏదైనా పేరుగాంచిన హోటల్‌లో పని అనుభవం ఉన్నవారికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి ఆగస్టు 1, 2024 తేదీ నాటికి 27 ఏళ్లకు మించకూడదు.

నెలకు రూ.46వేల జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 బేసిక్ పే ఉంటుంది. అలాగే అలవెన్స్‌లను చెల్లిస్తారు. దీంతో మొత్తం నెలకు రూ.46,210 వరకు వేతనం ఇస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు రూ.400 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలు, ఒంటరి మహిళల పిల్లలు అయితే రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. తమకు నచ్చిన భాషలో అభ్యర్థులు ఎగ్జామ్ రాయవచ్చు. తరువాత కుకింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 12, 2024వ తేదీ వరకు గడువు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.sci.gov.in/recruitments/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.