NLCIL Trade Apprentice Recruitment 2024 : కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న NLCIL (Neyveli Lignite Corporation India Limited) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు డిగ్రీ, డిప్లొమా చేసిన వారు అర్హులని తెలియజేసింది. అభ్యర్థులు 2020 నుంచి 2024 మధ్యలో విద్యార్హతలను పూర్తి చేసి ఉండాలి. వీరికి ఏడాదిపాటు NLCILలో అప్రెంటిస్‌గా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
మొత్తం 505 అప్రెంటిస్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ లేదా డిగ్రీ, డిప్లొమా చేసిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.nlcindia.in/ అనే అధికారిక వెబ్సైట్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ను చూడవచ్చు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబర్ 2, 2024వ తేదీ వరకు గడువును నిర్ణయించారు.

మార్కులను బట్టి అభ్యర్థుల ఎంపిక..
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 19, 2024వ తేదీనే ప్రారంభమైంది. ప్రింట్ తీసిన అప్లికేషన్ ఫామ్‌లను సెప్టెంబర్ 7, 2024వ తేదీ వరకు పంపవచ్చు. డిప్లొమా లేదా డిగ్రీలో వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగంలో మొత్తం 197 ఖాళీలు ఉండగా, నాన్ ఇంజినీరింగ్ డిగ్రీ విభాగంలో 155 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా విభాగంలో 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 505 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆఖరి తేదీ ఇదే..
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేయవచ్చు. ప్రింట్ తీయబడిన అప్లికేషన్ ఫామ్‌ను అభ్యర్థులు.. ది జనరల్ మేనేజర్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, నెయ్వెలి, 607803.. అనే చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సెప్టెంబర్ 7, 2024వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులకు సెప్టెంబర్ 2, 2024వ తేదీ వరకు గడువును విధించారు. ఈ పోస్టులకు సంబంధించిన వయో పరిమితి, ఇతర వివరాలను తెలుసుకోవాలంటే అభ్యర్థులు పైన తెలిపిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను చూడవచ్చు. అక్కడే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు కూడా చేయవచ్చు.