IOL Recruitment 2024 For Project Engineer : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి,, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ వివిధ పత్రికల్లో ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9, 2024వ తేదీ వరకు విడుదలైంది.
నోటిఫికేషన్ విడుదలయ్యాక అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు 21 రోజులు గడువుగా నిర్ణయించారు. అంటే ఆగస్టు 24 నుంచి ఆగస్టు 30, 2024వ తేదీ వరకు గడువు ఉందని చెప్పవచ్చు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1 లక్ష వరకు వేతనం ఇస్తారు. పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు మొత్తం 13 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డిజైన్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 3 ఖాళీ ఉండగా, రోబోటిక్ ఫర్మ్‌వేర్ అండ్ కంట్రోల్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు 8 ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతలు ఇవే..
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకాట్రానిక్స్, కంప్యూటర్స్ విభాగాల్లో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. అలాగే పని అనుభవం ఉంటే ఇంకా మంచిది. ఇక ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు గాను అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. దీంతోపాటు సీఏ లేదా సీఎంఏ పాస్ అయి ఉండాలి. కనీసం 1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు గరిష్ట వేతనం నెలకు రూ.1 లక్ష ఉండగా, ప్రాజెక్ట్ మేనేజర్‌కు నెలకు రూ.85వేల వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://www.indiaoptel.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అందులో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. లేదా నోటిఫికేషన్లో ఇచ్చిన చిరునామాకు తమ పత్రాలను పంపించి ఆఫ్ లైన్లోనూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.