DME AP Senior Resident Recruitment 2024 : ఏపీ వైద్య‌శాఖ‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.70వేలు జీతం..!

DME AP Senior Resident Recruitment 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (AP DME) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. AP DME ప‌రిధిలోని ప్ర‌భుత్వ వైద్య‌, దంత వైద్య కాలేజీల్లోని వివిధ డిపార్ట్‌మెంట్ల‌లో మొత్తం 997 ఖాళీలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. సీనియ‌ర్ రెసిడెంట్‌, సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ మేర‌కు రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. మెడిక‌ల్ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 27, 2024వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. మ‌రిన్ని వివ‌రాల‌కు https://dme.ap.nic.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు విజిట్ చేయ‌వ‌చ్చు. మొత్తం 997 ఖాళీలు ఉండ‌గా.. సీనియ‌ర్ రెసిడెంట్ క్లినిక‌ల్ పోస్టులు 425 ఖాళీగా ఉన్నాయి. అలాగే సీనియ‌ర్ రెసిడెంట్ (నాన్ క్లినిక‌ల్‌) పోస్టులు 479 ఖాళీగా ఉన్నాయి. సూప‌ర్ స్పెషాలిటీ పోస్టులు 93 ఖాళీగా ఉన్న‌ట్లు తెలిపారు.

DME AP Senior Resident Recruitment 2024 know the full details and how to apply
DME AP Senior Resident Recruitment 2024

ఈ విభాగాల్లో ఖాళీలు..

జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, గైన‌కాల‌జీ, అన‌స్తీషియా, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆప్తాల్మాల‌జీ, ఈఎన్‌టీ, డెర్మ‌టాల‌జీ, రెస్పిరేట‌రీ మెడిసిన్‌, సైకియాట్రీ, రెడియో డ‌యాగ్న‌సిస్‌, రేడియాల‌జీ, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్‌, డెంటిస్ట్రీ, డెంట‌ల్ స‌ర్జ‌రీ, రేడియో థెర‌పీ, ట్రాన్స్‌ఫ్యూజ‌న్ మెడిసిన్‌, హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, అనాట‌మీ, ఫిజియాల‌జీ, బ‌యో కెమిస్ట్రీ, ఫార్మ‌కాల‌జీ, పాథాల‌జీ, మైక్రో బయాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌, క‌మ్యూనిటీ మెడిసిన్‌, కార్డియాల‌జీ, ఎండోక్రైనాల‌జీ, మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ, స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ, న్యూరాల‌జీ, కార్డియో థొరాసిక్ స‌ర్జ‌రీ, సీవీటీ స‌ర్జ‌రీ, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, పీడియాట్రిక్ స‌ర్జ‌రీ, యూరాల‌జీ, న్యూరో స‌ర్జ‌రీ, నెఫ్రాల‌జీ, స‌ర్జిక‌ల్ అంకాల‌జీ, మెడిక‌ల్ అంకాల‌జీ, నియోనాటాల‌జీ త‌దిత‌ర స్పెషాలిటీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

విద్యార్హ‌త‌లు, వ‌యో ప‌రిమితి..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మెడిక‌ల్ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. వ‌యో ప‌రిమితి 44 ఏళ్లు మించ‌కూడ‌దు. నెల‌కు జీతం రూ.70వేలు చెల్లిస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ఏడాది పాటు క‌చ్చితంగా ప‌నిచేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల‌ను మెరిట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులు రూ.500 చెల్లిస్తే చాలు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆగ‌స్టు 27, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. క‌నుక అర్హులైన వారు, ఆస‌క్తి ఉన్న వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.