How To Get PAN Card : మీ ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డును ఇలా పొందండి..!

How To Get PAN Card : ప్ర‌స్తుత త‌రుణంలో PAN కార్డ్ ఉండ‌డం ఎంతో ఆవ‌శ్య‌కం అయింది. మ‌నం ట్యాక్స్ క‌ట్టాల‌న్నా లేదా బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల‌న్నా PAN ను అడుగుతారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు PAN కార్డు పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఇంత‌కు ముందు PAN కార్డు పొందాలంటే చాలా త‌తంగం ఉండేది. కానీ ఇప్పుడలాంటి అవ‌సరం లేదు. మీరు మీ ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డును ఇలా పొంద‌వ‌చ్చు. అందుకు కింద సూచించిన విధంగా ప‌లు స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌క‌మ్ ట్యాక్స్ సైట్ ద్వారా..

పాన్‌ను మీరు అనేక విధాలుగా పొంద‌వ‌చ్చు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్ ద్వారా అయితే ఇన్‌స్టంగ్‌గా మీరు పాన్ కార్డును జ‌న‌రేట్ చేయ‌వ‌చ్చు. ఇందుకు మీ ద‌గ్గ‌ర ఆధార్ నంబ‌ర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in ను సంద‌ర్శించి అందులో ఉండే Instant e-PAN అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయ‌మ‌ని అడుగుతుంది. అక్క‌డ ఆ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. త‌రువాత మీ ఆధార్‌కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని ఎంట‌ర్ చేసి ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌కు ఒప్పుకుంటూ క్లిక్ చేయాలి. అనంతరం మీ వ్య‌క్తిగత స‌మాచారం తెర‌పై వ‌స్తుంది. అన్ని వివ‌రాలు స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని అక్క‌డే ఉండే Continue అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

How To Get PAN Card easily while staying at home by following this simple method
How To Get PAN Card

త‌రువాత మీ ఫోన్ నంబ‌ర్‌కు ఒక మెసేజ్ వ‌స్తుంది. అందులో ఇన్‌స్టంట్‌గా జ‌న‌రేట్ అయిన మీ పాన్ నంబ‌ర్ ఉంటుంది. ఇలా మీరు 10 నిమిషాల్లోనే e-PAN card ను జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. దీని స‌హాయంతో మీరు పన్ను చెల్లింపులు చేయ‌వ‌చ్చు లేదా బ్యాంకు లావాదేవీల‌ను కూడా నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఎన్ఎస్‌డీఎల్ సైట్‌లోనూ..

ఇక NSDL వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి కూడా పాన్‌ను పొంద‌వ‌చ్చు. ఇందుకు గాను https://nsdl.co.in అనే సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. అందులో New PAN for Indian Citizens అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. త‌రువాత స‌రైన విభాగాన్ని ఎంచుకుని అక్క‌డే మీ ఇంటి పేరు, పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్‌, ఫోన్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి. త‌రువాత మీ మెయిల్‌కు ఒక టోకెన్ నంబ‌ర్‌ను పంపిస్తారు. మీ మెయిల్‌లో వ‌చ్చే Continue With PAN Application అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. త‌రువాత మీరు ప‌త్రాల‌ను ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఏ మాధ్య‌మంలో స‌బ్‌మిట్ చేయ‌ద‌ల‌చుకున్నారో తెలియ‌జేయాలి. ప‌త్రాల‌న స‌బ్‌మిట్ చేశాక ప్లాస్టిక్ కార్డ్ రూపంలో పాన్ కార్డ్ పొందేందుకు గాను ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అనంత‌రం పాన్ అప్లికేష‌న్‌ను స‌బ్‌మిట్ చేయాలి. త‌రువాత మీ ఎదుట పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు పేమెంట్ చేసిన వెంట‌నే మీకు ఒక ర‌శీదు వ‌స్తుంది. దాంతో మీరు మీ పాన్ అప్లికేష‌న్‌ను ట్రాక్ చేసుకోవ‌చ్చు.

యూటీఐఐటీఎస్ఎల్ సైట్ ద్వారా కూడా..

ఇక UTIITSL వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు పాన్ కార్డును పొంద‌వ‌చ్చు. ఇందుకు గాను మీరు www.utiitsl.com అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. అందులో PAN Card for Indian Citizens / NRI అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. త‌రువాత మీరు ప‌త్రాల‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దేని ద్వారా స‌బ్‌మిట్ చేయాల‌నుకుంటున్నారో చెప్పాలి. అనంత‌రం స‌బ్‌బిట్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీకు ఒక రిఫ‌రెన్స్ నంబ‌ర్ వ‌స్తుంది. అనంత‌రం OK అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేసి ముందుకు కొన‌సాగాలి. త‌రువాత మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. అలాగే సంబంధిత ప‌త్రాల‌ను కూడా స‌బ్‌మిట్ చేయాలి.

ఇప్పుడు మీ ఎదుట పేమెంట్ పేజీ ప్ర‌త్య‌క్షం అవుతుంది. అందులో మీరు పేమెంట్ పూర్తి చేయాలి. త‌రువాత మీకు ర‌శీదు మెయిల్ ద్వారా వ‌స్తుంది. దాంతో మీరు మీ పాన్ కార్డు అప్లికేష‌న్‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. ఈ విధంగా మూడు మార్గాల్లో మీరు కొత్త పాన్ కార్డును పొంద‌వ‌చ్చు. అయితే అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా పాన్ కార్డును పొందాల‌నుకుంటే మాత్రం మొద‌ట చెప్పిన ప‌ద్ధ‌తి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో మీరు కేవ‌లం 10 నిమిషాల్లోనే పాన్ కార్డును పొంద‌గ‌లుగుతారు.