IRDAI Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.1.46 ల‌క్ష‌లు..

IRDAI Recruitment 2024 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. IRDAI లో ప‌లు విభాగాల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ పోస్టుల‌కు అప్లికేష‌న్ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 20, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకునేందుకు irdai.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

IRDAI లో మొత్తం 49 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. వాటిల్లో 21 పోస్టుల‌ను జ‌న‌ర‌ల్ విభాగంలో భ‌ర్తీ చేస్తారు. మ‌రో 4 పోస్టుల‌ను ఈడబ్ల్యూఎస్ విభాగంలో, 12 పోస్టుల‌ను ఓబీసీ విభాగంలో, 8 పోస్టుల‌ను ఎస్సీ విభాగంలో, 4 పోస్టుల‌ను ఎస్‌టీ విభాగంలో భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థుల వ‌య‌స్సు 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అంటే సెప్టెంబ‌ర్ 20, 2024వ తేదీ నాటికి అభ్య‌ర్థులు 21 సెప్టెంబ‌ర్ 1994 నుంచి 20 సెప్టెంబ‌ర్ 2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

IRDAI Recruitment 2024 full details and know how to apply
IRDAI Recruitment 2024

వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు..

ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో 5 ఏళ్ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉంటాయి. ఓబీసీ అభ్య‌ర్థుల‌కు అయితే గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో 3 ఏళ్ల వ‌ర‌కు స‌డ‌లింపుల‌ను ఇచ్చారు. పోస్టుల‌ను బ‌ట్టి అభ్య‌ర్థులు భిన్న ర‌కాల విద్యార్హ‌త‌ల‌ను క‌లిగి ఉండాలి. ఈ వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటిఫికేష‌న్‌ను చూడ‌వ‌చ్చు. ఇక అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష‌లు రెండు ద‌శ‌ల్లో ఉంటాయి.

రాత ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

ఫేజ్‌-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌, ఫేజ్-2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి. ఫేజ్‌-1 ఎగ్జామ్‌లో 160 ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్ర‌శ్న‌లు అడుగుతారు. దీనికి 90 నిమిషాల స‌మ‌యం ఇస్తారు. ఫేజ్‌-2 ఎగ్జామ్‌లో 3 పేప‌ర్స్ ఉంటాయి. వీటికి ఒక్కో పేప‌ర్‌కు 100 మార్కులు ఉంటాయి. ప‌రీక్ష రాసేందుకు 1 గంట స‌మ‌యం ఇస్తారు. అభ్య‌ర్థులు రూ.750 అప్లికేష‌న్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థులు రూ.100 అప్లికేష‌న్ ఫీజును చెల్లించాలి. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.1.46 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం ఇస్తారు. క‌నుక ఆస‌క్తి, అర్హత ఉన్న‌వారు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే అక్క‌డే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.