HCL Tech Bee Mega Job Mela 2024 : ఇంట‌ర్ పూర్తి చేసిన వాళ్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెల 30న మెగా జాబ్ మేళా.. ఎక్క‌డంటే..?

HCL Tech Bee Mega Job Mela 2024 : మీరు ఇంట‌ర్ పూర్తి చేసి ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? లేదా ఈ మ‌ధ్య‌నే ఇంట‌ర్ పాస్ అయ్యారా..? అయితే ఈ జాబ్ మేళా మీ కోస‌మే. వీరితోపాటు వొకేష‌న‌ల్ కోర్సులు చేసిన వారికి కూడా ఇదొక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అభ్య‌ర్థులంద‌రి కోసం హెచ్‌సీఎల్ కంపెనీ వారు జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట‌ర్ లేదా వొకేష‌న‌ల్ కోర్సులు పూర్తి చేసిన అభ్య‌ర్థుల కోసం హెచ్‌సీఎల్ టెక్ బీ ఆధ్వ‌ర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు నిజామాబాద్ జిల్లా ఇంట‌ర్ విద్యాధికారి ర‌వికుమార్‌, కంపెనీ ప్ర‌తినిధి ఆర్‌.రాజేష్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

HCL Tech Bee Mega Job Mela 2024 know the full details and where is it
HCL Tech Bee Mega Job Mela 2024

 

ఈనెల 30న జాబ్ మేళా..

ఈ నెల 30వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల ఆడిటోరియంలో ఈ జాబ్ మేళాను నిర్వ‌హించ‌నున్నారు. దీనికి వొకేష‌న‌ల్ గ్రూపుల విద్యార్థులు, సీఈసీ, హెచ్ఈసీ, బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో 75 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు అర్హుల‌ని తెలియ‌జేశారు. పూర్తి వివ‌రాలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ కోసం 8074065803, 9701665424 ఫోన్ నంబ‌ర్ల‌లో అభ్య‌ర్థులు సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు.

కాగా హెచ్‌సీఎల్ కంపెనీ తన టెక్‌బీ ప్రోగ్రామ్ ద్వారా ఔత్సాహికులైన అభ్య‌ర్థుల కోసం ఈ మేళాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో ఎంపిక వారికి ఆ సంస్థ శిక్ష‌ణ ఇచ్చి త‌గిన జాబ్‌ను అంద‌జేస్తుంది.