Indian Stock Market Holidays : సోమవారం ఆగస్టు 26, 2024వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉన్నందున ఆ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందా.. అని ట్రేడర్లలో సందేహం నెలకొంది. అలాగే మరుసటి రోజు.. అంటే మంగళవారం ఆగస్టు 27, 2024వ తేదీన దహీ హండీ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుందా.. అని ట్రేడర్లు ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లారిటీ ఇచ్చేశాయి.
ఆగస్టు 26, 27 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి, దహీ హండీ ఉన్నప్పటికీ ఆయా తేదీల్లో స్టాక్ మార్కెట్లు యథావిధిగా ఓపెన్ ఉంటాయని వెల్లడించాయి. స్టాక్ మార్కెట్లు ఎప్పటిలాగే నడుస్తాయని చెప్పాయి. అలాగే కమోడిటీ మార్కెట్ సైతం యథావిధిగా ఆపరేట్ అవుతుందని చెప్పాయి. ఆగస్టు నెలలో 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాడు మాత్రమే ట్రేడింగ్ హాలిడే ఉందని, కృష్ణాష్టమికి ఎలాంటి సెలవు లేదని, కనుక ట్రేడర్లు ట్రేడింగ్ చేసుకోవచ్చని తెలిపాయి.

ఇక రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ హాలిడే వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1వ తేదీన దీపావళి, నవంబర్ 15వ తేదీన గురునానక్ జయంతి, డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కారణంగా స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉంటాయి. ఇక మిగిలిన రోజుల్లో శని, ఆది వారాలు తప్ప అన్ని దినాల్లోనూ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని చెప్పాయి. కనుక ట్రేడర్లు ఈ తేదీలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.