Union Bank Of India Apprentice Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు..

Union Bank Of India Apprentice Recruitment 2024 : ముంబై కేంద్రంగా దేశ‌వ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌ల్లో ప‌నిచేసేందుకు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 500 అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఈ రాష్ట్రాల్లో మొత్తం 92 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.15వేలు స్ట‌యిపెండ్ ఇస్తారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఆగ‌స్టు 28, 2024 నుంచి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కాగా సెప్టెంబ‌ర్ 17, 2024ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఆలోగా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.unionbankofindia.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Union Bank Of India Apprentice Recruitment 2024 full details and how to apply
Union Bank Of India Apprentice Recruitment 2024

మొత్తం 500 ఖాళీలు..

మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉండ‌గా, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో మొత్తం 92 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ‌లో 42, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు అర్హులు. అప్రెంటిస్ శిక్ష‌ణ కాలం 1 సంవత్స‌రం కాగా ఈ స‌మ‌యంలో నెల‌కు రూ.15వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ టెస్ట్, లోక‌ల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌, సర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ఉంటుంది.

ఆన్‌లైన్ టెస్టులో భాగంగా జ‌న‌ర‌ల్ లేదా ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌పై 25 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 25 మార్కులు ఉంటాయి. జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 25 ప్ర‌శ్న‌ల‌కు 25 మార్కులు, క్వాంటిటేటివ్ అండ్ రీజినింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్ర‌శ్న‌ల‌కు 25 మార్కులు, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌పై 25 ప్ర‌శ్న‌ల‌కు 25 మార్కులు ఉంటాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు అప్లికేష‌న్ ఫీజును జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.800గా నిర్ణ‌యించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, మ‌హిళా అభ్య‌ర్థులు రూ.600 అప్లికేష‌న్ ఫీజు, దివ్యాంగులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 17, 2024 తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేయాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అక్క‌డే ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.