BEEI Teacher Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. BEEI లో ఉపాధ్యాయ పోస్టులు..

BEEI Teacher Recruitment 2024 : BEL ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ (BEEI)లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. టెంప‌ర‌రీ ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు BEEI వెల్ల‌డించింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 9, 2024 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే మెరిట్ ప్ర‌కారం ముందుగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. త‌రువాతే రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు.

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://bel-india.in/wp-content/uploads/2024/08/Job-Details.pdf అనేవెబ్‌సైట్‌ను సంద‌ర్శించి నోటిఫికేష‌న్‌ను చూడ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 31 ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. క‌న్న‌డ‌, కామ‌ర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఫిజిక్స్‌, బ‌యాల‌జీ, స్టాటిస్టిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, డ్యాన్స్‌, పీఈటీ, మ్యూజిక్‌, లైబ్రేరియ‌న్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ స్ట‌డీస్ త‌దిత‌ర విభాగాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

BEEI Teacher Recruitment 2024 full details and how to apply
BEEI Teacher Recruitment 2024

అభ్య‌ర్థులు ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివి ఉండాలి. మిగిలిన విభాగాల‌కు సంబంధిత కోర్సుల‌లో క‌నీసం పీజీ చేసి ఉండాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు పైన ఇచ్చిన లింక్‌లోని నోటిఫికేష‌న్‌ను చూడ‌వ‌చ్చు. ఇక ఈ పోస్టుల‌కు ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి అనే వివ‌రాల‌ను కూడా నోటిఫికేష‌న్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.