RRB NTPC Recruitment 2024 : రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఇంట‌ర్ చ‌దివితే చాలు..!

RRB NTPC Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేప‌ట్ట‌నున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీస్ (NTPC) పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 11,558 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు RRB వెల్లడించింది.

అండ‌ర్ గ్రాడ్యుయేట్ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు 12వ త‌ర‌గ‌తి లేదా దానికి స‌మాన‌మైన అర్హ‌త క‌లిగిన బోర్డు నుంచి ధ్రువ‌ప‌త్రాల‌ను క‌లిగి ఉండాలి. అలాగే వ‌య‌స్సు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్వ్‌డ్ విభాగాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. గ్రాడ్యుయేట్ పోస్టుల‌కు గాను ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ లేదా కాలేజీ నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీని పొంది ఉండాలి. వ‌య‌స్సు 18 నుంచి 33 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

RRB NTPC Recruitment 2024 full details and how to apply
RRB NTPC Recruitment 2024

ద‌ర‌ఖాస్తు ఫీజు..

అభ్య‌ర్థులు రూ.500 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడ‌బ్ల్యూడీ, మ‌హిళా అభ్య‌ర్థులు, ట్రాన్స్‌జెండ‌ర్లు, ఎక్స్ స‌ర్వీస్ మెన్‌, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ క‌మ్యూనిటీలు, ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు చెందిన వ‌ర్గాల వారు అప్లికేష‌న్ ఫీజు రూ.250 చెల్లించాలి. ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్ అప్లికేష‌న్ల‌ను సెప్టెంబ‌ర్ 14, 2024వ తేదీ నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 13, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు indianrailways.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

అభ్య‌ర్థుల‌ను ప‌లు ద‌ఫాలుగా ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. మొద‌టి ద‌శ‌లో కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, మ్యాథ్స్‌, రీజ‌నింగ్ ఎబిలిటీస్‌పై ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఇందులో పాస్ అయిన వారు రెండో ద‌శ‌కు అర్హ‌త సాధిస్తారు. రెండో ద‌శ‌లోనూ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కానీ ఈసారి ప‌రీక్ష కాస్త క‌ఠినంగా ఉంటుంది. త‌రువాత టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌, డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. మ‌రిన్ని వివ‌రాల కోసం పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చు.