Punjab and Sind Bank Recruitment 2024 : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఖాళీలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు..

Punjab and Sind Bank Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌లలో లేట‌ర‌ల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ప‌లు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 210 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు సెప్టెంబ‌ర్ 15, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://punjabandsindbank.co.in/content/recuitment అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. మొత్తం పోస్టులు 213 ఖాళీ ఉండ‌గా.. వాటిల్లో ఆఫీస‌ర్ పోస్టులు 56, మేనేజ‌ర్ పోస్టులు 117, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు 33, చీఫ్ మేనేజ‌ర్ పోస్టులు 7 ఖాళీగా ఉన్నాయి.

Punjab and Sind Bank Recruitment 2024 full details and how to apply
Punjab and Sind Bank Recruitment 2024

జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు..

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, రాజ్ భాష‌, హ్యూమ‌న్ రీసోర్స్‌, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, సైబ‌ర్ సెక్యూరిటీ, అకౌంట్స్‌, ఫారెక్స్‌, ప‌బ్లిక్ రిలేష‌న్ అండ్ ప‌బ్లిసిటీ, కార్పొరేట్‌, ఐఎస్ ఆడిట‌ర్‌, సైబ‌ర్ ఫోరెన్సిక్స్‌, వెబ్ డెవ‌ల‌ప‌ర్‌, ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌, చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌, లా త‌దిత‌ర విభాగాల్లో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం ఆఫీసర్ ఉద్యోగాల‌కు అయితే రూ.48వేల నుంచి రూ.85 వేల వ‌ర‌కు ఉంటుంది. అదేవిధంగా మేనేజ‌ర్ పోస్టుల‌కు నెల‌కు రూ.64 వేల నుంచి రూ.93వేల వ‌ర‌కు వేత‌నం ఇస్తారు. అలాగ సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల‌కు నెల‌కు రూ.85వేల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు, చీఫ్ మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.1.02 ల‌క్ష‌ల నుంచి రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు నెల‌కు వేతనం ఇస్తారు.

అభ్య‌ర్థుల‌ను విద్యార్హ‌త‌ల‌తోపాటు రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ టెస్ట్ త‌దిత‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ కేట‌గిరికి చెందిన అభ్య‌ర్థులు రూ.850 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్య‌ర్థులు రూ.100 చెల్లిస్తే చాలు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.