మార్కెట్‌లో ఉన్న బెస్ట్ వాట‌ర్ ప్యూరిఫైర్లు ఇవే.. ధ‌ర త‌క్కువ‌.. ఆరోగ్యం కోసం త‌ప్ప‌దు..!

మ‌న‌కు రోగాలు వ‌చ్చేందుకు కార‌ణం అయ్యే వాటిల్లో ప్ర‌ధానంగా క‌లుషిత నీరే అతి ముఖ్య‌మైన‌ది అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తాగే నీళ్ల‌ను మ‌నం శుభ్రంగా ఉన్నాయ‌నుకుంటాం. కానీ మ‌న‌కు తెలియని ఎన్నో బాక్టీరియా, ఫంగ‌స్ మ‌నం తాగే నీళ్లలో ఉంటాయి. దీంతో అలాంటి నీళ్ల‌ను తాగితే మ‌నం రోగాల బారిన ప‌డ‌తాం. క‌నుక నీళ్ల‌ను ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. అయితే మార్కెట్‌లో మంచి వాట‌ర్ ప్యూరిఫైర్ ఏది.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోస‌మే కింద కొన్ని వాట‌ర్ ప్యూరిఫైర్ల వివ‌రాల‌ను అంద‌జేస్తున్నాం. వాటిని ఒక‌సారి చూసి మీకు న‌చ్చిన వాట‌ర్ ప్యూరిఫైర్‌ను కొనుక్కోండి. ఇక ఆ వివ‌రాల‌ను ఇప్పుడు చూద్దామా.

నేటివ్ ఎం1 అనే వాట‌ర్ ప్యూరిఫైర్ ధ‌ర రూ.14,499 ఉంది. కానీ దీనిపై అమెజాన్‌లో 31 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్నారు. దీంట్లో యూవీ, కాప‌ర్ చార్జ్‌, ఆల్క‌లీన్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇవి నీటిని 99 శాతం మేర శుద్ధి చేస్తాయి. క‌నుక ఈ వాట‌ర్ ప్యూరిఫైర్ ఉత్త‌మం అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఆక్వాగార్డ్ కంపెనీకి చెందిన ష్యూర్ డిలైట్ అనే వాట‌ర్ ప్యూరిఫైర్‌ను కూడా మీరు కొన‌వ‌చ్చు. దీని ధ‌ర అమెజాన్‌లో రూ.8,999గా ఉంది. ఇది నీటిని అద్భుతంగా క్లీన్ చేస్తుంది.

best water purifiers available in market

కెంట్ కూడా బాగానే ఉంటుంది..

ఇక కెంట్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఆర్‌వో వాట‌ర్ ప్యూరిఫైర్ కూడా బాగానే ప‌నిచేస్తుంది. ఇందులో ఆర్‌వో, యూఎఫ్‌, టీడీఎస్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీని ధ‌ర అమెజాన్‌లో రూ.13,999గా ఉంది. అయితే ప‌లు బ్యాంకు కార్డుల ద్వారా దీనిపై రాయితీ పొంద‌వ‌చ్చు. అలాగే కిన్‌స్కో ఆక్వా పంచ్ అనే ప్యూరిఫైర్ కూడా బాగానే ఉంటుంది. దీని ధ‌ర అమెజాన్‌లో రూ.4,199 మాత్ర‌మే. అందువ‌ల్ల ఇది బ‌డ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్ప‌వ‌చ్చు.

ఇక ఆక్వాడి ప్యూర్ 4 ఇన్ 1 అనే వాట‌ర్ ప్యూరిఫైర్ కూడా బాగానే ప‌నిచేస్తుంది. దీంట్లో కాప‌ర్ టెక్నాల‌జీ ఉంది. ఇది రాగి నీళ్ల‌ను తాగిన ఫీలింగ్‌ను ఇస్తుంది. అలాగే టీడీఎస్‌తోపాటు నీటిలో ఉండే మ‌లినాల‌ను తొల‌గిస్తుంది. పురుగు మందులు, లోహ క‌ణాలు, హానిక‌ర‌మైన బ్యాక్టీరియా, వైర‌స్‌ల‌ను నీటి నుంచి తీసేస్తుంది. ఇక ఈ ప్యూరిఫైర్ అమెజాన్‌లో రూ.4,701 కు వ‌స్తోంది. క‌నుక వీటిల్లో మీకు న‌చ్చిన వాట‌ర్ ప్యూరిఫైర్‌ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. వాట‌ర్ ప్యూరిఫైర్ ద్వారా నీళ్ల‌ను తాగండి. ఆరోగ్యంగా ఉండండి.