HRRL Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగాలు..

HRRL Recruitment 2024 : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ రాజ‌స్థాన్ సంయుక్తంగా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశాయి. హెచ్‌పీసీఎల్ రాజ‌స్థాన్ రిఫైన‌రీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్‌)లో 100 ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలిపాయి. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.

జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌, ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టులు 37 ఖాళీగా ఉన్నాయి. 3 ఏళ్ల ఫుల్ టైమ్ డిప్లొమా లేదా 60 శాతం మార్కుల‌తో సైన్స్ డిగ్రీ ఉండ‌లి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీల‌కు 50 శాతం స‌రిపోతుంది. ఫైర్ లేదా సేఫ్టీ లేదా ఫైర్ అండ్ సేఫ్టీలో క‌నీసం 6 నెల‌ల వ్యవ‌ధి ఉన్న స‌ర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి. వ‌య‌స్సు 25 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. అలాగే జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ మెకానిక‌ల్ పోస్టులు 4 ఉన్నాయి. వీటికి 60 శాతం మార్కుల‌తో మెకానిక‌ల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్‌టీ, పీడ‌బ్ల్యూడీలు 50 శాతం మార్కుల‌తో పాస్ అవ్వాలి. వ‌య‌స్సు 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

HRRL Recruitment 2024 know the full details and how to apply
HRRL Recruitment 2024

అర్హ‌త‌లు..

అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. 50 శాతం మార్కుల‌తో చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసి ఉండాలి. వ‌య‌స్సు 25 ఏళ్ల‌కు మించకూడ‌దు. అసిస్టెంట్ ఇంజినీర్ కెమిక‌ల్ ప్రాసెస్ పోస్టులు 12 ఖాళీగా ఉన్నాయి. 60 శాతం మార్కుల‌తో బీఈ లేదా బీటెక్ కెమిక‌ల్‌, పెట్రో కెమిక‌ల్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. వ‌య‌స్సు 25 ఏళ్లు మించ‌కూడ‌దు. మెకానిక‌ల్ ఇంజినీర్ పోస్టులు 14 ఖాళీగా ఉండ‌గా 60 శాతం మార్కుల‌తో బీఈ లేదా బీటెక్ మెకానిక‌ల్ లేదా మెకానిక‌ల్ అండ్ ప్రొడ‌క్ష‌న్ పాస్ అయి ఉండాలి. వ‌య‌స్సు 29 ఏళ్లు మించ‌కూడదు. పెట్రోలియం, రిఫైనింగ్‌, పెట్రో కెమిక‌ల్‌, ఫెర్టిలైజ‌ర్ సంస్థ‌లో సూప‌ర్ వైజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్‌గా 3 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.

కెమిక‌ల్ ఇంజినీర్ పోస్టులు 27 ఖాళీగా ఉండ‌గా 60 శాతం మార్కుల‌తో బీఈ లేదా బీటెక్ కెమిక‌ల్ లేదా పెట్రో కెమిక‌ల్ పూర్తి చేసి ఉండాలి. 29 ఏళ్లు మించ‌కూడ‌దు. ఆప‌రేషన్స్‌, టెక్నిక‌ల్‌, ప్రాసెస్ విభాగంలో 3 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. ఇంజినీర్ ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టులు 4 ఖాళీ ఉన్నాయి. వీటికి గాను 60 శాతం మార్కుల‌ల‌తో బీఈ లేదా బీటెక్ ఫైర్, ఫైర్ అండ్ సేఫ్టీ పూర్తి చేసి ఉండాలి. 29 ఏళ్లు మించ‌కూడ‌దు. పెట్రోలియం రిఫైనింగ్‌, ఆయిల్ అండ్ గ్యాస్‌, ఎక్స్‌ప్లోరేష‌న్‌, ఫార్మాసూటిక‌ల్‌, ఫెర్టిలైజ‌ర్ రంగాల్లో 3 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు..

యూఆర్ లేదా ఓబీసీ (ఎన్‌సీఎల్‌) లేదా ఈడబ్ల్యూఎస్‌ల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.1800 గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీల‌కు ఫీజు లేదు. కంప్యూట‌ర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తి సిల‌బ‌స్‌ను వెబ్‌సైట్‌లో త్వ‌ర‌లోనే అందుబాటులోకి తేనున్నారు. ఇంజినీర్ ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టుల‌కు ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 4ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు www.hrrl.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.