AIESL Recruitment 2024 : ఏఐఈఎస్ఎల్‌లో అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్ ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.27వేలు..

AIESL Recruitment 2024 : ముంబైలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న మొత్తం 76 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రీజిన‌ల్ సెక్యూరిటీ ఆఫ‌ర్ పోస్టులు 3 ఖాళీ ఉండ‌గా, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్ (సెక్యూరిటీ) పోస్టులు 73 ఖాళీ ఉన్నాయి. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిగ్రీని క‌లిగి ఉండాలి. అలాగే ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

బీసీఎస్ బేసిక్ ఏవీఎస్ఈసీ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వేత‌నం నెల‌కు రీజిన‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ పోస్టుకు రూ.47,625 చెల్లిస్తారు. అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్ పోస్టుకు రూ.27,940 చెల్లిస్తారు. రీజ‌న‌ర‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ పోస్టుకు వ‌య‌స్సు గ‌రిష్టంగా 40 ఏళ్లు మించ‌కూడ‌దు. అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్ పోస్టుకు వ‌య‌స్సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

AIESL Recruitment 2024 full details and how to apply
AIESL Recruitment 2024

ద‌ర‌ఖాస్తు ఫీజు..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీల‌కు ఫీజులో మిన‌హాయింపును క‌ల్పించారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు హైద‌రాబాద్‌, ఢిల్లీ, ముంబై, తిరువ‌నంత‌పురం, చెన్నై, కోల్‌క‌తా, నాగ్‌పూర్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆఫ్ లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. చీఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ ఆఫీస‌ర్‌, ఏఐ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌, ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్‌, సెకండ్ ఫ్లోర్‌, సీఆర్ఏ బిల్డింగ్‌, స‌ఫ్ద‌ర్‌జంగ్ ఎయిర్ పోర్ట్ కాంప్లెక్స్‌, అర‌బిందో మార్గ్‌, న్యూఢిల్లీ అనే అడ్ర‌స్‌కు అభ్య‌ర్థులు త‌మ అప్లికేష‌న్‌లను పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 24ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు www.aiesl.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.