Tata Memorial Center Recruitment 2024 : ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 29 నాన్ మెడికల్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు విద్యార్హతలు, అనుభవం ఆధారంగా, మరికొన్ని పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్, రేడియేషన్ అంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సెంట్రల్ స్టెరైల్ సప్లయి, మైక్రో బయాలజీ, మైక్రో మెడికల్, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ల్యాబ్, జనరల్ మెడిసిన్, ఐసీయూ, ఓటీ, ప్లంబర్, మెకానికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత పోస్టుకు అనుగుణంగా 10వ తరగతి నుంచి ఐటీఐ లేదా డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివి ఉండాలి. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.
నెలకు వేతనం ఎంతంటే..?
టెక్నిషియన్ సి-4 పోస్టులకు గాను పదో తరగతి లేదా ఐటీఐ ప్లంబర్, మెకానికల్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. నెలకు రూ.25,500 వేతనం ఇస్తారు. ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి. అలాగే డిగ్రీ చదివి ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ ఉన్నవారు హోటల్ లేదా హాస్పిటల్, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ ఆఫీసర్ లేదా సూపర్ వైజర్ లేదా అసిస్టెంట్‌గా పనిచేసిన వారు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫసీర్ 8 పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. వీరికి నెలకు రూ.35,400 వేతనం ఇస్తారు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఈ పోస్టుల్లో కొన్నింటికి అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా చెక్ చేస్తారు. వంద మీటర్ల పరుగును సాధారణ అభ్యర్థులు 10 సెకన్లలో, మాజీ సైనికోద్యోగులు 20 సెకన్లలో పూర్తి చేయాలి. వయస్సును బట్టి నిర్ణీత సంఖ్యలో పుషప్స్ లేదా సిటప్స్ తీయాలి. ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధిస్తే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 20ని చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://tmc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.