Southern Railway Sports Quota Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్ చ‌దివితే చాలు.. స్పోర్ట్స్ కోటాలో జాబ్‌..!

Southern Railway Sports Quota Recruitment 2024 : భార‌తీయ రైల్వేలో భాగ‌మైన ద‌క్షిణ రైల్వేలో ఖాళీగా ఉన్న 67 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఇటీవ‌లే నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేష‌న్ సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 6ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://rrcmas.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను చూడ‌వ‌చ్చు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు చెన్నైలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. మొత్తం 67 పోస్టుల్లో లెవ‌ల్ 4 అండ్ 5 పోస్టులు 5 ఖాళీ ఉండ‌గా, లెవ‌ల్ 2 అండ్ 3 పోస్టులు 16, లెవ‌ల్ 1 పోస్టులు 46 ఖాళీగా ఉన్నాయి. సంబంధిత పోస్టును బ‌ట్టి అభ్య‌ర్థులు అథ్లెటిక్స్‌, బాడీ బిల్డింగ్‌, చెస్ వెయిట్‌లిఫ్టింగ్‌, బాస్కెట్ బాల్, బాక్సింగ్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌, టేబుల్ టెన్నిస్‌, వాలీ వాల్ వంటి క్రీడ‌ల్లో ప్రావీణ్య‌త సాధించి ఉండాలి.

Southern Railway Sports Quota Recruitment 2024 full details and how to apply
Southern Railway Sports Quota Recruitment 2024

విద్యార్హ‌త‌లు ఇవే..

లెవ‌ల్ 1 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు టెన్త్ పాస్ అయి ఉండాలి. లేదా ఐటీఐ లేదా దానికి స‌మాన‌మైన అర్హ‌త‌ను క‌లిగి ఉండే స‌ర్టిఫికెట్ కోర్సును చేసి ఉండాలి. దానికి నాక్ గుర్తింపు ఉండాలి. లెవ‌ల్ 2 అండ్ 3 పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థులు ఇంట‌ర్ చ‌దివి ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్‌ల‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లెవ‌ల్ 4 అండ్ 5 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే వారు డిగ్రీ చ‌దివి ఉండాలి. క్రీడ‌ల్లో ఏప్రిల్ 1, 2022 అనంత‌రం సాధించిన స‌ర్టిఫికెట్ల‌ను ప్రాధాన్య‌త‌లోకి తీసుకుంటారు.

ఇక ఈ పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. లెవ‌ల్ 1 పోస్టుల‌కు ప్రారంభంలో నెల‌కు రూ.18వేలు ఇస్తారు. లెవ‌ల్ పోస్టుల‌కు రూ.19,900, లెవ‌ల్ 3 పోస్టుల‌కు రూ.21,700, లెవ‌ల్ 4 పోస్టుల‌కు రూ.25,500, లెవ‌ల్ 5 పోస్టుల‌కు ప్రారంభంలో రూ.29,200 నెల‌స‌రి వేత‌నం ఇస్తారు. అభ్య‌ర్థుల‌ను స్పోర్ట్స్‌లో సాధించిన మెరిట్‌తోపాటు విద్యార్హ‌తలో సాధించిన మెరిట్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఎంపిక చేస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు పైన ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డే ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు.