NIACL Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) దేశవ్యాప్తంగా పలు బ్రాంచిలలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ 1) పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్‌రిజర్వుడు అభ్యర్థులకు 71 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లకు 17, ఓబీసీలకు 45, ఎస్సీలకు 25, ఎస్టీలకు 12 పోస్టులను కేటాయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాన్ని బట్టి ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులను సాధించి ఉండాలి. అలాగే రిజర్వుడ్ అభ్యర్థులకు 55 శాతం ఉంటే సరిపోతుంది. సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపులు ఉంటాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ లేదా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 29ని చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 13న ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. నవంబర్ 17న ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు www.newindia.co.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.