JCIL Recruitment 2024 : కోల్‌కతాలో ఉన్న జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జపేసీఐఎల్) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగాల్లో అన్ రిజర్వ్‌డ్ 38 ఉండగా, ఈడబ్ల్యూఎస్‌లకు 8, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 21, ఎస్సీలకు 15, ఎస్టీలకు 8 పోస్టులను కేటాయించారు. అకౌంటెంట్ పోస్టులు 23 ఖాళీ ఉండగా.. అడ్వాన్సడ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ స్పెషల్ సబ్జెక్ట్‌గా ఎంకామ్ పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్ అకౌంట్స్ లేదా నగదు, రికార్డుల నిర్వహణలో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా బీకాం పాసై 7 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. ఏసీఏ, ఎస్ఏఎస్, సీఏ, ఏసీడబ్ల్యూఏ, సీఏడీ చేసిన వారికి ప్రాధాన్యతను ఇస్తారు. వేతనం నెలకు రూ.28,600 నుంచి రూ.1.15 లక్షల వరకు ఇస్తారు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 25 ఖాళీగా ఉండగా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలను టైప్ చేయగలగాలి. నెలకు వేతనం రూ.21,500 నుంచి రూ.80వేల వరకు ఇస్తారు. జూనియర్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 42 ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. జూట్ అమ్మకాలు లేదా కొనుగోళ్లు, గ్రేడింగ్, బెయిలింగ్, స్టోరేజ్ లేదా రవాణాలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. నెలకు వేతనం రూ.21,500 నుంచి రూ.80వేల వరకు ఇస్తారు.
వయో పరిమితి వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్‌టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరిని బట్టి 10 నుంచి 15 ఏళ్లు, జేసీఐఎల్ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు www.jutecorp.in అనే వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.