BHEL Apprentice Recruitment 2024 : హైద‌రాబాద్ BHELలో పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

BHEL Apprentice Recruitment 2024 : హైద‌రాబాద్‌లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్ లిమిటెడ్ (BHEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు BHEL తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ ద్వారా మొత్తం 100 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 13తో ముగుస్తోంది. సెప్టెంబ‌ర్ 24న ప‌రీక్ష ఉంటుంద‌ని వెల్ల‌డించారు. మ‌రిన్ని వ‌వ‌రాల‌కు https://hpep.bhel.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్ చ‌ట్టం 1961 ప్ర‌కారం అభ్య‌ర్థుల‌కు ఒక సంవత్స‌రం పాటు ట్రేడ్ అప్రెంటిస్‌లుగా శిక్ష‌ణ ఇస్తారు. అభ్య‌ర్థులు ఇప్ప‌టికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉంటే లేదా ఐటీఐ పూర్తి చేసి ఒక సంవ‌త్స‌రం అనుభ‌వం క‌లిగి ఉంటే అలాంటి వారు ఈ శిక్ష‌ణ తీసుకోవాల్సిన ప‌నిలేదు. ఇక అసెస్‌మెంట్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. త‌రువాత మెరిట్ లిస్ట్‌ను విడుద‌ల చేస్తారు.

BHEL Apprentice Recruitment 2024 full details and how to apply
BHEL Apprentice Recruitment 2024

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాలి..

మొద‌ట అభ్య‌ర్థులు అప్రెంటిస్ షిప్ పోర్టల్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. అందుకు గాను https://www.apprenticeshipindia.gov.in/ అనే సైట్‌ను సంద‌ర్శించాలి. రిజిస్ట్రేష‌న్ త‌రువాత అభ్య‌ర్థులు సంబంధిత ట్రేడ్‌లో BHEL రామ‌చంద్రాపురం హైద‌రాబాద్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. BHEL హైద‌రాబాద్ వెబ్‌సైట్ https://hpep.bhel.com/index.jsp ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

మొత్తం 100 పోస్టుల్లో ఫిట్ట‌ర్ పోస్టులు 20, మెషినిస్ట్ పోస్టులు 40, ట‌ర్న‌ర్ పోస్టులు 26, వెల్డ‌ర్ పోస్టు 1 ఖాళీగా ఉన్నాయి. అభ్య‌ర్థులు సంబంధిత ట్రేడ్‌ల‌లో టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్య‌ర్థులు ఐటీఐలో క‌నీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులు 55 శాతం మార్కుల‌ను సాధించి ఉండాలి. సెప్టెంబర్ 1, 2024 నాటికి అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. అభ్య‌ర్థుల‌ను అసెస్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ద్వారా ఎంపిక చేస్తారు.

అప్రెంటిస్ ఎంపిక అభ్య‌ర్థులు సాధించిన మార్కుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. రాత ప‌రీక్ష‌( 60 నిమిషాలు)కు ఆబ్జెక్టివ్ త‌ర‌హా మ‌ల్టిపుల్ చాయిస్ లో సంబంధిత ట్రేడ్ సిల‌బ‌స్ నుంచి 50 ప్ర‌శ్న‌ల‌ను అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉండ‌వు. కేవ‌లం కొన్ని గంట‌లే స‌మ‌యం ఉంది క‌నుక వెంట‌నే రిజిస్ట‌ర్ చేసుకోండి.