ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది దసరా ముందులాగే ఈసారి కూడా అతి పెద్ద సేల్‌కు రెడీ అయింది. వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తేదీలను ఆ సంస్థ ప్రకటించేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట ఈసారి సెప్టెంబర్ 27 నుంచి భారీ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు నుంచే అందుబాటులోకి వస్తుంది. అంటే.. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఈ సేల్‌ను సెప్టెంబర్ 26 నుంచే యాక్సెస్ చేయవచ్చు.
ఈసారి సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డు యూజర్లకు భారీ ఎత్తున డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే యూపీఐతో చేసే రూ.1000 ఆపైన పేమెంట్లకు గాను రూ.100 రాయితీ పొందవచ్చు. సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 నుంచి 80 శాతం వరకు, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం వరకు రాయితీలను అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే ఉత్పత్తుల వారిగా డిస్కౌంట్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
మొబైల్స్ ధరలు రూ.5,999 నుంచే..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా రూ.5,999 నుంచే మొబైల్స్ ను అమ్మనున్నట్లు అమెజాన్ తెలియజేసింది. మొబైల్ యాక్ససరీస్ రూ.89 నుంచే ప్రారంభం అవుతాయని పేర్కొంది. 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలియజేసింది. స్మార్ట్ టీవీల ధరలు కూడా రూ.6,999 నుంచే ప్రారంభం అవుతాయని తెలియజేసింది. అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ స్టిక్‌ల ధరలు రూ.1,999 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక సేల్ సమయంలో ట్రావెల్ బుకింగ్‌లపై కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.