హైద‌రాబాద్ ECIL లో ఖాళీలు.. రాత ప‌రీక్ష లేకుండా పోస్టింగ్‌..!

హైద‌రాబాద్‌లో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ECIL తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 437 అప్రెంటిస్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

మొత్తం 437 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులు 162, ఎల‌క్ట్రిషియ‌న్ పోస్టులు 70, ఫిట్ట‌ర్ పోస్టులు 70, మెకానిక్ ఆర్ అండ్ సేఫ్టీ పోస్టులు 17, ట‌ర్న‌ర్ పోస్టులు 17, మెషినిస్ట్ పోస్టులు 17 ఖాళీగా ఉన్నాయి. అలాగే గ్రైండ‌ర్ మెషినిస్ట్ పోస్టులు 13, సీవోపీఏ పోస్టులు 45, వెల్డ‌ర్ పోస్టులు 22, పెయింట‌ర్ పోస్టులు 4 ఖాళీగా ఉన్నాయి.

ecil apprentice recruitment 2024 full details

వ‌యో ప‌రిమితి వివ‌రాలు..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు అక్టోబ‌ర్ 31 నాటికి 18 నుంచి 25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ఓబీసీల‌కు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు, దివ్యాంగుల‌కు 10 ఏళ్ల స‌డ‌లింపు ఉంటుంది. సంబంధిత ట్రేడ‌లో ఐటీఐ ఉత్తీర్ణ‌త క‌లిగి ఉండాలి. అప్రెంటిస్ శిక్ష‌ణ వ్య‌వ‌ధి ఒక సంవ‌త్స‌ర కాలం ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ అంశాల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ల‌ను ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌, న‌లంద కాంప్లెక్స్‌, టీఐఎఫ్ఆర్ రోడ్డు, ఈసీఐఎల్‌, హైద‌రాబాద్ అనే స్థ‌లంలో వెరిఫై చేస్తారు.

ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 13న ప్రారంభం కాగా, ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీని సెప్టెంబ‌ర్ 29, 2024గా నిర్ణ‌యించారు. అక్టోబ‌ర్ 7 నుంచి అక్టోబ‌ర్ 9 వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలిస్తారు. అక్టోబ‌ర్ 30ను ప్ర‌వేశాల‌కు గ‌డువు తేదీగా నిర్ణయించారు. న‌వంబ‌ర్ 1 నుంచి అప్రెంటిస్ శిక్ష‌ణ ప్రారంభం అవుతుంది.