గుడ్ న్యూస్‌.. కెన‌రా బ్యాంక్‌లో 3000 ఖాళీలు.. డిగ్రీ చ‌దివితే చాలు..

బెంగ‌ళూరులోని కెన‌రా బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. బెంగ‌ళూరులో ఉన్న కెన‌రా బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ విభాగం ప్ర‌ధాన కార్యాల‌యం ఈ భారీ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు కెన‌రా బ్యాంకు శాఖ‌ల్లో అప్రెంటిస్‌షిప్ శిక్ష‌ణ‌లో భాగంగా అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3000 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 4ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను సెప్టెంబ‌ర్ 21న వెల్ల‌డించ‌నున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://canarabank.com/pages/Recruitment అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. మొత్తం 3000 ఖాళీలు ఉండ‌గా, ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ లేదా కాలేజీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ లేదా బీటెక్ చేసిన వారు కూడా అర్హులే.

apprentice ship posts in canara bank full details are here

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌యో ప‌రిమితి సెప్టెంబ‌ర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్‌టీల‌కు 5 ఏళ్లు, బీసీల‌కు 3 ఏళ్లు, దివ్యాంగుల‌కు 10 ఏళ్ల వ‌ర‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఇచ్చారు. అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఒక సంవ‌త్స‌ర కాలం పాటు శిక్ష‌ణ‌నిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ అయ్యే నోటిఫికేష‌న్‌ను అభ్య‌ర్థులు చూడ‌వ‌చ్చు. త‌రువాత పైన ఇచ్చిన వెబ్‌సైట్‌లో ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.