ఇస్రోలో ఉద్యోగాలు.. ఇప్పుడే ద‌ర‌ఖాస్తు చేసుకోండి..!

ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ISRO) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. బెంగ‌ళూరులోని హ్యూమ‌న్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఈ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న 103 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, స్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ త‌దిత‌రాల ఆధారంగా ఈ పోస్టుల‌కు అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 9ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.hsfc.gov.in/HSFCRecruitment అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఇస్రోలో మొత్తం 103 ఖాళీలు ఉండ‌గా మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఎస్‌డీ లేదా ఎస్‌సీ పోస్టులు 3, సైంటిస్టు లేదా ఇంజినీర్ ఎస్సీ పోస్టులు 10, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు 28, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 1, టెక్నిషియ‌న్ బి పోస్టులు 43, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు 13, రాజ్ భాష అసిస్టెంట్ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి. పోస్టును బ‌ట్టి అభ్య‌ర్థులు టెన్త్ నుంచి పీజీ చ‌దివి ఉండాలి. క‌నీసం 60 శాతం మార్కుల‌ను సాధించి ఉండాలి. డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఈ, ఎంటెక్ చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

jobs in isro know full details and how to apply

ఈ పోస్టుల్లో అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే వారి వ‌య‌స్సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు. మిగిలిన పోస్టుల‌కు వ‌య‌స్సు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు, ఓబీసీల‌కు 3 ఏళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, స్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉటుంది.