భారీ త‌గ్గింపు ధ‌ర‌కే ఐఫోన్ 16.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన‌వ‌చ్చు..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఎంతో ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా షాపుల వ‌ద్ద ఐఫోన్ 16 ఫోన్ల కోసం భారీ క్యూలైన్లు కూడా క‌నిపిస్తున్నాయి. అయితే ఐఫోన్ 16 ఫోన్‌ను మీరు గ‌న‌క కొనాల‌ని అనుకుంటుంటే ఫ్లిప్‌కార్ట్‌లో చాలా త‌క్కువ ధ‌ర‌కే ఈ ఫోన్‌ను కొన‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను రూ.50వేల లోపు ధ‌ర‌తోనే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అద్భుత‌మైన ఆఫ‌ర్‌తో ఈ ఫోన్‌ను త‌క్కువ ధ‌ర‌కు సొంతం చేసుకోవ‌చ్చు. ఇక ఐఫోన్ 16 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో చాలా త‌క్కువ ధ‌ర‌కే ఎలా కొన‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 16కు చెందిన 128జీబీ బేస్ వేరియెంట్ ధ‌ర రూ.79,990 ఉండ‌గా, ఈ ఫోన్‌కు చెందిన 256 జీబీ మోడ‌ల్ ధర రూ.89,990గా ఉంది. అలాగే 512 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,09,990గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో 128జీబీ మోడ‌ల్ ఐఫోన్ 16 ఫోన్‌ను రూ.48,650 ధ‌రకు కొన‌వ‌చ్చు. ఇందుకు గాను మీరు మీ ద‌గ్గ‌ర మంచి కండిష‌న్‌లో ఉన్న ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీకు రూ.26,250 బోన‌స్ వ‌స్తుంది. అలాగే ఐసీఐసీఐ కార్డుల‌ను వాడితే మ‌రో రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. దీంతో ఐఫోన్ 16 మీకు రూ.48,650కి వ‌స్తుంది. ఇలా ఐఫోన్ 16 ఫోన్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్‌లో చాలా త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

you can get iphone 16 at huge discounted price on flipkart

ఇక ఐఫోన్ 16కు చెందిన ఇత‌ర వేరియెంట్ల‌పై కూడా ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. క‌నుక ఆ మోడ‌ల్స్‌ను కూడా మీరు త‌క్కువ ధ‌ర‌ల‌కే పొంద‌వ‌చ్చు. కాగా యాపిల్ త్వ‌ర‌లోనే ఎం4 చిప్స్ క‌లిగిన మాక్‌బుక్‌ల‌ను రిలీజ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన ఐఫోన్ల‌లో ఏఐ ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌డం విశేషం. దీంతో ఈ ఫోన్లు ఐఫోన్ ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అందువ‌ల్లే ఈ ఫోన్ల‌ను వారు కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.