నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 3,445 ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ‌వ్యాప్తంగా ప‌లు రైల్వే డివిజ‌న్ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ఆర్ఆర్‌బీ తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 3,445 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 21 నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 20ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

మొత్తం 3445 పోస్టుల్లో టిక్కెట్ క్ల‌ర్క్ పోస్టులు 2022 ఉండ‌గా, టైపిస్ట్ పోస్టులు 361, జూనియ‌ర్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రెయిన్ క్ల‌ర్క్ పోస్టులు 72 ఖాళీగా ఉన్నాయి. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో 89, తూర్పూ రైల్వేలో 56 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల వ‌యస్సు 18 నుంచి 33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఇంట‌ర్ చ‌దివిన వారు అర్హులు.

jobs in railways full details and how to apply

అప్లికేష‌న్ ఫీజును రూ.500గా నిర్ణ‌యించారు. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ఫీజు నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. అయితే కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌కు హాజ‌రైతే రూ.400 రీఫండ్ ఇస్తారు. ఇక మ‌రిన్ని వివ‌రాల‌కు గాను అభ్య‌ర్థులు https://www.rrbapply.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డే ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.