విప్రోలో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. విప్రో కంపెనీలో ఎల్‌1 టెక్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. డిగ్రీ అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://careers-wipro.icims.com/jobs/3106357/ అనే వెబ్ సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు అప్లై చేసే వారికి ఎంఎస్ ఎక్సెల్ వ‌చ్చి ఉండాలి. అలాగే న్యూట్ర‌ల్ వాయిస్ అండ్ యాక్సెంట్‌, కాల్ మేనేజ్‌మెంట్‌, మ‌ల్టీ టాస్క్‌, ప్రాసెస్ నాలెడ్జ్‌, అన‌లిటిక‌ల్ స్కిల్స్ ఉండాలి. ఈ పోస్టుల‌కు ఆన్ లైన్‌లో అప్లై చేయాలి.

wipro l1 support jobs know full details and how to apply

దేశ‌వ్యాప్తంగా అనేక టెక్ కంపెనీల్లో ల‌క్ష‌ల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే అభ్య‌ర్థుల‌కు త‌గిన స్కిల్స్ ఉండ‌డం లేద‌ని ఇటీవ‌లే గుర్తించారు. క‌నుక పైన తెలిపిన స్కిల్స్‌ను డిగ్రీ చ‌దివిన వారు నేర్చుకుంటే ఎందులో అయినా స‌రే జాబ్‌ను ఇట్టే సాధించ‌వ‌చ్చు. కాబ‌ట్టి పైన చెప్పిన స్కిల్స్‌లో ముందుగా ప్రావీణ్య‌త సంపాదించండి. దీంతో జాబ్ ఆటోమేటిగ్గా వ‌స్తుంది.