అమెజాన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వాళ్ల‌కు అవ‌కాశం..

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అమెజాన్‌లో డిజిట‌ల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఏదైనా డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు హైద‌రాబాద్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుంటానికి లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌డానికి అభ్య‌ర్థులు https://www.amazon.jobs/en/jobs/2748442/digital-content-associate అనే వెబ్‌సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

amazon jobs for degree holders here are details

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు ఎంఎస్ ఆఫీస్ ప్రొడ‌క్ట్స్ అండ్ అప్లికేష‌న్‌, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్‌, ఆంగ్ల భాషా నైపుణ్యం, డేటా అనాల‌సిస్ ట్ర‌బుల్ షూటింగ్ వంటి స్కిల్స్ ఉంటే మంచిది. పని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు చివ‌రి తేదీ అంటూ లేదు. క‌నుక అభ్య‌ర్థులు ఆయా స్కిల్స్‌ను సాధించి ఈ పోస్టుల‌కు అప్లై చేస్తే జాబ్ సాధించ‌వ‌చ్చు.