IOCL Jobs 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 443 ఖాళీలు..

IOCL Jobs 2024 : నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ శుభ‌వార్త చెప్పింది. ఆ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 443 ఖాళీలు ఉండ‌గా అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ అనేది ప్ర‌భుత్వ రంగ సంస్థ. ఇందులో ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 4 విభాగంలో 256 పోస్టులు ఖాళీ ఉండ‌గా, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ – 4 విభాగంలో 99 ఖాళీలు ఉన్నాయి.

అలాగే జూనియ‌ర‌ల్ క్వాలిటీ కంట్రోల్ అన‌లిస్ట్ – 4 విభాగంలో 21 ఖాళీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ విభాగంలో 38 ఖాళీలు, టెక్నిక‌ల్ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన వారు ప్రొడ‌క్ష‌న్‌, పీ అండ్ యూ, ఓ అండ్ ఎం, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, టీ అండ్ ఐ సెక్ష‌న్ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ చేసిన వారు అర్హులు. కాగా ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.

IOCL Jobs 2024 how to apply and eligibility full details
IOCL Jobs 2024

సీబీటీ ఆధారంగా ఎంపిక‌..

ఈ ఉద్యోగాల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), షార్ట్ లిస్ట్‌ల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఇక ద‌ర‌ఖాస్తు ఫీజు అంద‌రికీ రూ.300గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఆగ‌స్టు 21, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబ‌ర్‌, 2024లో ఉంటుంది. ఫ‌లితాల‌ను అక్టోబ‌ర్ 3వ వారంలో ప్ర‌క‌టిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://iocl.com అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవ‌చ్చు.