SAIL Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. రాత ప‌రీక్ష లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం.. జీతం రూ.1.60 ల‌క్ష‌లు..

SAIL Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం రావాల‌ని కోరుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆగ‌స్టు 19ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మొత్తం 19 పోస్టుల‌కు SAIL ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

SAIL లో జీడీఎంవో విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే డెంట‌ల్ జీడీఎంవోలో 1, రేడియాల‌జీ స్పెష‌లిస్ట్ – 2 పోస్టులు, ఆప్త‌ల్మాల‌జీ స్పెష‌లిస్ట్ – 1 పోస్టు, స‌ర్జ‌రీ స్పెష‌లిస్ట్ – 2 పోస్టులు, గైన‌కాల‌జీ స్పెష‌లిస్ట్ – 1 పోస్టు, అన‌స్థిషియాల‌జీ – 1 పోస్టు, ఓహెచ్ఎస్ స్పెష‌లిస్ట్ – 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

SAIL Recruitment 2024 apply for central government job without written exam
SAIL Recruitment 2024

ఎలాంటి రాత ప‌రీక్ష లేదు..

ఇక SAIL అధికారిక నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు గ‌రిష్టంగా 69 ఏళ్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. అలాగే సంబంధిత విభాగంలో విద్యార్హ‌త‌ల‌ను క‌లిగి ఉండాలి. ఇక ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.1.60 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం ఇస్తారు. SAIL రిక్రూట్‌మెంట్ 2024 ప్ర‌క్రియ‌ను ఇంట‌ర్వ్యూల ద్వారా పూర్తి చేస్తారు. ఎలాంటి రాత ప‌రీక్ష లేదు. అయితే అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూకు వ‌చ్చేట‌ప్పుడు సంబంధిత ప‌త్రాలు అన్నింటినీ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

అభ్య‌ర్థులు తాము సొంతంగా నింపిన ద‌ర‌ఖాస్తు ఫారాల‌ను SAILకు చెందిన మెయిల్ ఐడీ rectt.dsp@sail.in కి పంపించాల్సి ఉంటుంది. అలాగే త‌మ ధ్రువ‌ప‌త్రాల‌ను కూడా ఈ-మెయిల్‌లో అటాచ్ చేయాల్సి ఉంటుంది. అర్హ‌త ఉన్న‌ అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఇక మ‌రిన్ని వివ‌రాల‌కు SAIL అధికారిక వెబ్‌సైట్ sail.inను సంద‌ర్శించ‌వ‌చ్చు.