అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్ టెల్‌.. ధ‌ర రూ.26 మాత్ర‌మే.. బెనిఫిట్స్ ఇవే..!

ఈ ఏడాది జూలైలో టెలికాం కంపెనీలు త‌మ మొబైల్ టారిఫ్‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోతున్నారు. ఇప్ప‌టికే 30 ల‌క్ష‌ల మంది కొత్త‌గా బీఎస్ఎన్ఎల్‌లో చేరినట్లు ఆ కంపెనీ ఇటీవ‌లే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. అయితే ఉన్న కస్ట‌మ‌ర్లు చేజారిపోకుండా ఉండేందుకు గాను జియో, ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియాలు నానా క‌ష్టాలు ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎయిర్ టెల్ తాజాగా ఓ చ‌వ‌కైన ప్లాన్‌ను నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టింది. దీని వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

కేవ‌లం రూ.26 మాత్ర‌మే..

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ రూ.26కు ఒక నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్ వాలిడిటీ ఒక రోజు మాత్ర‌మే కాగా.. దీని ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు 1.50 జీబీ డేటా ల‌భిస్తుంది. గ‌తంలో ఈ ప్లాన్ రూ.22గా ఉండేది. దీన్ని మార్చి రూ.26 కు లాంచ్ చేశారు. అయితే ఇది కేవ‌లం డేటా యాడాన్ ప్యాక్ మాత్ర‌మే. అందువ‌ల్ల దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు ఎలాంటి వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ల‌భించ‌వు.

airtel launched rs 26 prepaid plan know its benefits

ఇక ఎయిర్‌టెల్‌లో ఇత‌ర డేటా యాడాన్ ప్యాక్‌ల విష‌యానికి వ‌స్తే రూ.77తో రీచార్జి చేసుకుంటే 5జీబీ డేటా ల‌భిస్తుంది. అదే రూ.121తో రీచార్జి చేసుకుంటే 6జీబీ డేటాను పొంద‌వ‌చ్చు. ఎయిర్‌టెల్ లాగే వొడాఫోన్ ఐడియా, రిల‌య‌న్స్ జియో కూడా ప‌లు డేటా యాడాన్ ప్యాక్‌ల‌ను అందిస్తున్నాయి. క‌స్ట‌మర్లు త‌మ‌కు ల‌భించిన డేటా అయిపోగానే ఈ డేటా యాడాన్ ప్యాక్‌ల‌ను వేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక మ‌రోవైపు BSNL కూడా వేగంగా 4జి, 5జి వైపు అడుగులు వేస్తోంది. ఆ కంపెనీలోకి క‌స్ట‌మ‌ర్లు భారీగా వ‌స్తుండ‌డంతో ఆ సంస్థ సెల్ ట‌వ‌ర్ల‌ను వేగంగా నిర్మిస్తోంది. దీంతో BSNLలో ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు 4జి రావ‌చ్చ‌ని, వ‌చ్చే ఏడాదిలో 5జి రావొచ్చ‌ని తెలుస్తోంది.