Amazon Work From Home Jobs 2024 : మీరు టెన్త్ పాస్ అయ్యారా..? మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే శుభవార్త మీకోసమే. మీరు గనక టెన్త్ పాస్ అయి ఉంటే మీకు అమెజాన్‌లో ఉద్యోగం చేసే గొప్ప సదవకాశం కల్పిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం ఐటీడీఏ పరిధిలో అమెజాన్ కంపెనీ మెగా జాబ్ మేళాను సెప్టెంబర్ 5, 2024వ తేదీన నిర్వహించనుంది. ఇందులో భాగంగా 300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అమెజాన్ తెలియజేసింది.
అమెజాన్ కంపెనీ వారు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు టెన్త్ చదివి ఉండాలి. అలాగే వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. స్త్రీలు, పురుషులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఈ జాబ్ మేళాలో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థలు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. నిరుద్యోగులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేళాలో పాల్గొనే అందరు విద్యార్థులు తమ బయో డేటా కాపీ, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కాపీ తీసుకుని రావల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీన సీతంపేటలోని పీఎంఆర్‌సీకి ఉదయం 9 గంటల వరకు హాజరు కావల్సి ఉంటుంది.

ఎలాంటి రాత పరీక్ష లేదు..
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులను అమెజాన్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారు. తరువాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు అమెజాన్ కంపెనీలో ముందుగా 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. తరువాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. అమెజాన్ కంపెనీ వారు నిర్వహించే ఈ జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత అభ్యర్థులను రెండు విభాగాల్లో దేనికైనా పనికోసం నియమిస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌లో అమెజాన్ ప్రొడక్ట్స్‌కు గాను టెలి కాలర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. లేదా ఆఫీస్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆఫీస్‌లు హైదరాబాద్, బెంగళూరులలో ఉన్నాయి. ఈవిధంగా రెండు విభాగాల్లో ఎందులో అయినా సరే పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ముందుగా సీతం పేట బస్టాంట్ చేరుకోవాలి. అ్కడి నుంచి సీతంపేటలో ఉన్న ఐటీడీఏ పీఎంఆర్‌సీ కార్యాలయానికి చేరుకోవాలి. పీఎంఆర్‌సీ ఆఫీస్‌లో అమెజాన్ కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 300 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కనుక నిరుద్యోగులు, యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.