ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. టెన్త్ అర్హ‌త‌తో అంగ‌న్ వాడీ ఉద్యోగాలు..

ఏపీలో ఉన్న మ‌హిళా నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ చెప్పింది. ఆ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగ‌న్ వాడీ కేంద్రాల్లో ప‌లు అంగ‌న్ వాడీ ఖాళీల భ‌ర్తీకి మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను సెప్టెంబ‌ర్ 17ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. సీకే దిన్నె, ముద్ద‌నూరు, క‌మ‌లాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్‌, ప్రొద్దుటూరు రూర‌ల్‌, క‌డ‌ప‌-1, పోరుమామిళ్ల‌, పులివెందుల‌, మైదుకూరు, బ‌ద్వేల్‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు త‌దిత‌ర ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప‌రిధిలో ఈ ఖాళీలు ఉన్నాయ‌ని సంబంధిత శాఖ అధికారులు వెల్ల‌డించారు. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://kadapa.ap.gov.in/ అనే వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చు.

anganwadi jobs to 10th pass women in andhra pradesh

మొత్తం 74 అంగ‌న్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉండ‌గా, మినీ అంగ‌న్ వాడీ కార్య‌కర్త పోస్టులు 4, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త పోస్టులు 59, అంగ‌న్ వాడీ స‌హాయ‌కురాలు పోస్టులు 11 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే మ‌హిళ‌ల వ‌య‌స్సు జూలై 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. అంగ‌న్ వాడీ కార్య‌కర్త పోస్టుకు అప్లై చేసే వారు 10వ త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు 7వ త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. స్థానికంగా ఉన్న మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డుతుంది.

7, 10వ త‌ర‌గ‌తుల్లో మార్కులు, ఇంట‌ర్వ్యూల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. వైఎస్సార్ జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యంలో అప్లికేష‌న్‌ను అంద‌జేయాలి. సెప్టెంబ‌ర్ 28వ తేదీన ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు.