APEPDCL Manager Recruitment 2024 : రాత ప‌రీక్ష లేకుండా ఏపీ విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

APEPDCL Manager Recruitment 2024 : విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) ప‌లు విభాగాల్లో ఖాళీగ ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు APEPDCL ఓ నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. సంస్థ‌లో ఖాళీగా ఉన్న మేనేజ‌ర్‌, ఐటీ ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థులు నేరుగా వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌చ్చు. ఎలాంటి రాత ప‌రీక్ష లేదు. కాగా వాకిన్ ఇంట‌ర్వ్యూ తేదీని త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించి విధంగా ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://apeasternpower.com/ అనే వెబ్‌సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. డేటా అన‌లిటిక్స్‌, డేటా సెంట‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్‌, సైబ‌ర్ సెక్యూరిటీ, శాప్‌, మొబైల్ అప్లికేష‌న్స్ విభాగాల్లో మేనేజ‌ర్‌గా ప‌నిచేసేందుకు ఒక్కో పోస్టు ఖాళీగా ఉంది. మొత్తం 5 పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను నియ‌మిస్తారు. పోస్టును బ‌ట్టి అభ్య‌ర్థులు బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ త‌దిత‌ర విద్యార్హ‌త‌ల‌ను క‌లిగి ఉండాలి. అలాగే క‌నీసం 5 నుంచి 8 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. గ‌రిష్ట వ‌యో ప‌రిమితి నోటిఫికేష‌న్ నాటికి 50 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

APEPDCL Manager Recruitment 2024 full details and how to apply
APEPDCL Manager Recruitment 2024

ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు..

ఆఫ్‌లైన్ విధానంలో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు వెబ్‌సైట్‌లో ఇచ్చిన రూల్స్‌ను పాటించాలి. అభ్య‌ర్థులను ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష లేదు. చీఫ్ జన‌ర‌ల్ మేనేజ‌ర్‌, హెచ్ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్‌, కార్పొరేట్ కార్యాల‌యం, సీతమ్మ‌ధార‌, విశాఖ‌ప‌ట్నం అనే చిరునామాలో అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు పైన ఇచ్చిన సైట్‌ను విజిట్ చేయ‌వ‌చ్చు.