Bank Holidays In October 2024 : సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్ నెల వస్తే చాలు, ఎన్నో పండుగలు వస్తుంటాయి. దీంతో ఎన్నో సెలవులు లభిస్తుంటాయి. అలాగే బ్యాంకులకు కూడా చాలా వరకు పనిదినాలు ఈ నెలలో ఉండవు. సాధారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులకు 12 రోజుల వరకు సెలవులు ఉంటాయి. ఇక ఈ సారి కూడా అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మళ్లీ పండుగలు సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇక అక్టోబర్లో ముందుగా గాంధీ జయంతి నాడు సెలవు దినంగా ఉంటుంది. దీపావళితో సెలవులు ముగుస్తాయి. అందువల్ల చాలా వరకు అక్టోబర్ నెలలో సాధారణంగా 12 రోజుల వరకు సెలవులు ఉంటాయి. అయితే ఈ సారి అక్టోబర్ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయి, బ్యాంకులు ఎన్ని రోజులు తెరుచుకుని ఉంటాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ నెలలో గాంధీ జయంతి, దసరా, దీపావళి వంటి పబ్లిక్ హాలిడేలు ఉంటాయి. అలాగే ప్రతి 2వ, 4వ శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక అసలు పనిదినాలు, సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 2 బుధవారం గాంధీ జయంతి. అందువల్ల బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 3 గురువారం కూడా బ్యాంకులకు సెలవు దినమే. ఎందుకంటే ఆ రోజు శరదియా నవరాత్రి అలాగే మహారాజ అగ్రసేన్ జయంతి కూడా ఉన్నాయి. అక్టోబర్ 6న ఆదివారం వీక్లీ హాలిడే ఉంటుంది.
అక్టోబర్ 10 గురువారం మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 11 శుక్రవారం మహానవమి కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 12 శనివారం దసరా వచ్చింది అలాగే 2వ శనివారం. ఇక అక్టోబర్ 13 ఆదివారం. ఆరోజు వీక్లీ హాలిడే. అక్టోబర్ 17న వాల్మీకి జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 20 ఆదివారం వీక్లీ హాలిడే. అక్టోబర్ 26 శనివారం 4వది కనుక బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 27 ఆదివారం. వీక్లీ హాలిడే. అక్టోబర్ 31న గురువారం దీపావళి సందర్భంగా సెలవు. ఇలా రానున్న అక్టోబర్ నెలలో సెలవులు లభించనున్నాయి.