BEL Project Engineer Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. BEL సంస్థలో ప్రాజెక్ట్ ఇంజినీర్, హవల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు గాను ఆగస్టు 23, 2024వ తేదీ వరకు గడువు ఉంది. అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు గాను https://bel-india.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
BEL సంస్థలో మొత్తం 11 ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ/సైబర్ సెక్యూరిటీ/కంప్యూటర్ నెట్‌వర్కింగ్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు నెలకు వేతనం రూ.40వేల నుంచి రూ.55వేల వరకు చెల్లిస్తారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 32 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఘజియాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. వీటికి గాను ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.472 కాగా ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపును ఇచ్చారు. రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు ఆగస్టు 23, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. కనుక అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.