BEML ITI Trainee Office Assistant Recruitment 2024 : బెంగళూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. BEMLలో 100 మేర ఐటీఐ ట్రెయినీ, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 23, 2024వ తేదీన ప్రారంభం కాగా సెప్టెంబర్ 4, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.
మొత్తం 100 పోస్టులకు ఖాళీలు ఏర్పడగా వాటిల్లో ఫిట్టర్ ఐటీఐ ట్రెయినీ పోస్టులు 7 ఉన్నాయి. టర్నర్ ఐటీఐ ట్రెయినీ పోస్టులు 11, మెషినిస్ట్ ఐటీఐ ట్రెయినీ పోస్టులు 10, ఎలక్ట్రిషియన్ ఐటీఐ ట్రెయినీ పోస్టులు 8, వెల్డర్ ఐటీఐ ట్రెయినీ పోస్టులు 18, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులు 46 ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 4, 2024వ తేదీ వరకు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత..
ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే గరిష్ట వయో పరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు నాక్ గుర్తింపు కలిగిన ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఐటీఐలో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. 3 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులకు గాను అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.200 ఉండగా, ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తు ఫీజును జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఇందుకు గాను డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాడుకోవచ్చు. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ (ఐటీఐ ట్రెయినీ పోస్టులకు), డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం రూ.60వేలు..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.16,900 నుంచి రూ.60,650 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. చివరి తేదీ సెప్టెంబర్ 4, 2024. అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను మళ్లీ ఒక్కసారి పూర్తిగా చదవాలి. ఆన్ లైన్‌లోకి వెళ్లి లింక్ ఓపెన్ చేసి అందులో పోస్టులకు అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్‌ను పూర్తిగా జాగ్రత్తగా నింపాలి. సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దీంతో అప్లికేషన్ ఫామ్ ప్రింట్ వస్తుంది. దాన్ని తీసుకుని భద్ర పరుచుకోవాలి. ఇక అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://www.bemlindia.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.