BSNL Rs 107 Prepaid Plan : BSNL లో అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌.. 35 రోజుల వాలిడిటీ..!

BSNL Rs 107 Prepaid Plan : ఈమ‌ధ్య‌నే ప్రైవేటు టెలికాం సంస్థ మొబైల్ చార్జిల ధ‌ర‌ల‌ను పెంచ‌డంతో అంద‌రూ BSNLకు మారిపోతున్నారు. అయితే BSNLలో ప్రైవేటు టెలికాం కంపెనీల క‌న్నా చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉండ‌డం విశేషం. క‌నుక‌నే ఇత‌ర మొబైల్ వినియోగ‌దారులు BSNLకు మారిపోతున్నారు. ఇక నెట్‌వ‌ర్క్ విష‌యంలో కాస్త స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ప‌రిష్క‌రించ‌డంపైనే BSNL ప్ర‌స్తుతం ఫోక‌స్ పెట్టింది. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున BSNL సిమ్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీల‌తో పోలిస్తే అత్యంత చ‌వ‌కైన ప్లాన్ ఒక‌టి BSNLలో అందుబాటులో ఉంది. దాని గురించిన వివ‌రాల‌న ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL ప్రీపెయిడ్ వినియోగ‌దారులు కేవ‌లం రూ.107 చెల్లిస్తే చాలు.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 35 రోజుల వాలిడిటీ వ‌స్తుంది. అలాగే 200 నిమిషాల కాల్స్ ఉచితంగా వ‌స్తాయి. వీటిని ఏ నెట్‌వ‌ర్క్‌కు అయినా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే 3జీబీ డేటా వ‌స్తుంది. ప్లాన్ వాలిడిటీ ప్ర‌కారం ఈ డేటా వాలిడిటీ కూడా ఉంటుంది. అంటే 3జీబీ డేటాను మీరు 35 రోజుల్లో ఎప్పుడైనా వాడుకోవ‌చ్చు.

BSNL Rs 107 Prepaid Plan you will get these benefits
BSNL Rs 107 Prepaid Plan

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఉప‌యోగం..

చాలా మంది అంత పెద్ద‌గా కాల్స్ మాట్లాడ‌రు, అలాగే డేటా వినియోగం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. మిడిల్ క్లాస్ వారు కొంద‌రు ఫీచ‌ర్ ఫోన్ల‌ను ఇప్ప‌టికీ ఉప‌యోగిస్తుంటారు. అలాంటి వారు ఈ చ‌వ‌కైన ప్లాన్‌ను వాడ‌వ‌చ్చు. BSNLలో మాత్ర‌మే ఈ చ‌వ‌క ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక ఇలాంటి మ‌రెన్నో ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి క‌నుక‌నే చాలా మంది BSNLలోకి మారిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే BSNL ఈమ‌ధ్య కాలంలోనే ఎన్నో ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కొత్త‌గా చేర్చుకుంది. ఇంకా చేర్చుకుంటూనే ఉంది. దీంతో BSNL సిమ్‌ల‌ను కొనేందుకు ప్ర‌జ‌లు సైతం ఆస‌క్తిని చూపిస్తున్నారు.