BSNL Rs 997 Prepaid Plan : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మరో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కస్టమర్లు రూ.997తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఏకంగా 320 జీబీ వరకు డేటా లభిస్తుంది. అంటే 1జీబీ డేటాకు కేవలం రూ.3.11 అవుతుందన్నమాట. ఈ ప్లాన్ ద్వారా ఆ డేటాను కస్టమర్లు రోజుకు 2 జీబీ వరకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను వాడుకోవచ్చు.
ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే ప్రీ లోడెడ్ కాలర్ ట్యూన్‌ను 2 నెలల వరకు ఉచితంగా పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా చొప్పున మొత్తం 320 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 160 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌ను మీరు ఏడాదిలో 2 సార్లు రీచార్జి చేసుకుంటే చాలన్నమాట. దీంతో మీకు రూ.1994 ఏడాదికి ఖర్చవుతుంది. అయితే ఏడాది ప్లాన్ మీకు జియో లేదా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో కావాలంటే అందుకు మీరు రూ.3వేలకు పైగానే చెల్లించాలి. అంటే ఆ కంపెనీల కన్నా BSNL లోనే ప్రీపెయిడ్ ప్లాన్ రేట్ తక్కువగా ఉందని చెప్పవచ్చు. అందుకనే చాలా మంది కస్టమర్లు ఇతర టెలికాం కంపెనీల నుంచి BSNL కు మారిపోతున్నారు.
త్వరలోనే 4జి సేవలు..
ఇక BSNL త్వరలోనే దేశవ్యాప్తంగా 4జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందుకు మరో 18 నుంచి 24 నెలలు పడుతుందని అంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఏడాది ఆఖరి నుంచే 4జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాదిలో BSNL దేశంలో 5జి సేవలను కూడా ప్రారంభిస్తుందని సమాచారం. ఇందుకు గాను ఇటీవలే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 5జి ద్వారా BSNL లో వీడియో కాల్ కూడా మాట్లాడారు. కనుక BSNL లో ఒకేసారి 4జి, 5జి రెండూ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఇక తక్కువ మొబైల్ టారిఫ్ కావాలనుకునే వారు BSNL కు మారిపోవచ్చు.