Cental Bank Of India Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాంకులో ఉద్యోగం.. నెల‌కు రూ.30వేలు జీతం..

Cental Bank Of India Recruitment 2024 : మీరు ఏదైనా బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇది గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ బ్యాంకులో ఫ్యాక‌ల్టీ, ఆఫీస్ అసిస్టెంట్‌, అటెండ‌ర్‌, వాచ్‌మ‌న్ లేదా గార్డెన‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ బ్యాంకుకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు centralbankofindia.co.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డే ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు గాను అప్లికేష‌న్ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా మొత్తం 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు గాను సెప్టెంబ‌ర్ 15ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. సెంట్ర‌ల్ బ్యాంకులో ఫ్యాక‌ల్టీ పోస్టులు 3 ఖాళీ ఉండ‌గా, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 5, అటెండెంట్ పోస్టులు 3, చౌకీదార్ లేదా గార్డెన‌ర్ పోస్టులు 2.. మొత్తం క‌లిపి 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Cental Bank Of India Recruitment 2024 full details and how to apply
Cental Bank Of India Recruitment 2024

విద్యార్హ‌త‌ల వివ‌రాలు..

ఫ్యాక‌ల్టీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు అభ్య‌ర్థులు ఏదైనా డిగ్రీ చ‌దివి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి. మాతృభాష ధారాళంగా వ‌చ్చి ఉండాలి. ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల‌పై ప‌ట్టు ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు మెట్రిక్యులేష‌న్ చ‌దివి ఉండాలి. లోక‌ల్ భాష‌లో రాయ‌డం, చ‌ద‌వ‌డం వ‌చ్చి ఉండాలి. చౌకీదార్ లేదా గార్డెన‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు క‌నీసం 7వ త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్ లో ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.

ఈ పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థుల వ‌యస్సు 22 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఫ్యాక‌ల్టీ అయితే నెల‌కు రూ.30వేలు ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ అయితే రూ.20వేలు, అటెండెంట్‌కు రూ.14వేలు ఇస్తారు. చౌకీదార్ లేదా గార్డెన‌ర్‌కు రూ.12వేలు ఇస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు పైన తెలిపిన వెబ్‌సైట్ ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.