Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో 1180 పోస్టులు..

Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL) భారీ సంఖ్య‌లో పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. రాంచీలో ఉన్న సీసీఎల్‌లో పెద్ద ఎత్తున అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ట్రేడ్‌, టెక్నిషియ‌న్ లేదా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే అప్లికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అయింది.

ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం 1180 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 484 ట్రేడ్ అప్రెంటిస్‌, 55 ఫ్రెష‌ర్ అప్రెంటిస్‌, 637 డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ట్రేడ్ అప్రెంటిస్‌కు సంబంధించి 280 ఎల‌క్ట్రిషియ‌న్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిట్ట‌ర్ పోస్టులు 150, డీజిల్ మెకానిక్ 30, వెల్డ‌ర్ 10, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ 2, అసోసియేట్ లీగ‌ల్ అసిస్టెంట్ 2, హెల్త్ శానిటీ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి.

Central Coalfields Limited Apprentice Recruitment 2024 full details and how to apply
Central Coalfields Limited Apprentice Recruitment 2024

ఏ విభాగంలో ఎన్ని..?

అలాగే 14 పాథాల‌జీ మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నిషియ‌న్ పోస్టులు, 4 మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ రేడియాల‌జీ టెక్నిషియ‌న్ పోస్టులు, డెంట‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నిషియ‌న్ పోస్టులు 2, మెడిక‌ల్ ఫిజియో థెర‌పీ ల్యాబ్ టెక్నిషియ‌న్ 2, మెడిక‌ల్ కార్డియాల‌జీ ల్యాబ్ టెక్నిషియ‌న్ పోస్టులు 4, స‌ర్వేయ‌ర్ పోస్టులు 8, వైర్‌మెన్ 5, మ‌ల్టీ మీడియా 10, వెబ్‌పేజ్ డిజైన‌ర్ 1, వెహికిల్ మెకానిక్ 5, ఎర్త్ మూవింగ్ మెషిన‌రీ మెకానిక్ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి.

ఇక టెక్నిషియ‌న్ అప్రెంటిస్ విష‌యానికి వ‌స్తే.. మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టులు 200, నాన్ మైనింగ్ ఇంజినీరింగ్ 210 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల‌కు గాను మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టులు 24, నాన్ మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టులు 170, నాన్ మైనింగ్ నాన్ ఇంజినీరింగ్ పోస్టులు 33 ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హ‌త‌లు..

ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఐటీఐ శిక్ష‌ణ‌తోపాటు 10వ త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స‌బ్జెక్టులో డిప్లొమా లేదా బీకామ్ డిగ్రీని క‌లిగి ఉండాలి. ట్రేడ్, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స‌సు 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఫ్రెష‌ర్ అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు 3 ఏళ్ల వ‌ర‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

ట్రేడ్ అప్రెంటిస్‌ల‌కు నెల నెలా రూ.7వేల స్టైఫండ్ ఇస్తారు. ఫ్రెష‌ర్ అప్రెంటిస్ మొద‌టి ఏడాది నెల‌కు రూ.7వేలు, 2వ ఏడాది నెల‌కు రూ.7700 ఇస్తారు. టెక్నిషియ‌న్ అప్రెంటిస్‌కు నెల‌కు రూ.8వేలు, గ్రాడ్యుయేష‌న్ అప్రెంటిస్‌కు నెల‌కు రూ.9వేలు స్టైఫండ్ ఇస్తారు. అభ్య‌ర్థుల‌ను 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు www.centralcoalfields.in అనే అధికారిక వెబ్‌సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.